X

Naked Culture: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

మన దేశంలో నగ్నత్వాన్ని తప్పుగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే, ఈ గ్రామంలో మాత్రం అది ఆచారం. అక్కడి మహిళలు తప్పకుండా 5 రోజులు నగ్నత్వాన్ని పాటించాల్సిందే.

FOLLOW US: 

న దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్కో వర్గానికి ఒక్కో ఆచారం ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు చాలా చిత్రంగా అనిపిస్తాయి. వాటి గురించి విన్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. అయితే, మన దేశంలో ఇప్పటికే చాలావరకు ఆచారాలు అంతరించిపోయాయి. యువత పాశ్చాత్య మార్గంలోకి అడుగుల వేస్తున్న నేపథ్యంలో మన పూర్వికుల నాటి ఆచారాలన్నీ కనుమరుగయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. ఇంకా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్న్ వ్యాలీ ప్రజలు కూడా ఈ కోవకే వస్తారు.

భారత దేశంలో నగ్నత్వాన్ని తప్పుగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే, పిని గ్రామానికి చెందిన ప్రజలకు మాత్రం అది సంప్రదాయం. వారి ఆచారం ప్రకారం.. అక్కడి మహిళలు ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. అయితే, ప్రతి రోజు నగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే అలా ఉండాలి. కొత్తగా పెళ్లయిన వధువు సైతం.. ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. ఆ 5 రోజులు భర్తకు దూరంగా ఉండాలి. అంతేకాదు.. ఆ 5 రోజులు ఇంట్లో ఎవరూ కనీసం నవ్వకూడదు కూడా. అయితే, నగ్నంగా ఉన్న ఐదు రోజులు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లరు. అలాగే బయట వ్యక్తులు కూడా వారిని చూడకూడదు. దానివల్ల వారు నగ్నంగా ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా గడుపుతారు.

గ్రామంలోని మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే వారి ఇంట్లో అశుభం కలుగుతుందని, బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని భావిస్తారు. ఈ సంప్రదాయం ప్రారంభం కావడం వెనుక ఒక కథ దాగి ఉంది. ఒకప్పుడు ఓ రాక్షసుడు పిని గ్రామాన్ని పీడించేవాడు. దుస్తులు ధరించిన అందమైన వివాహిత మహిళలను ఎత్తుకుపోయేవాడు. దీంతో అక్కడి మహిళలు దుస్తులు విప్పేసి.. తమని రక్షించాలని దేవతలను వేడుకున్నారు. వారి మొర అలగించిన దేవతలు ఆ రాక్షసుడిని సంహరించి.. గ్రామ మహిళలను రక్షించారు. అప్పటి నుంచి అక్కడి మహిళలు ఏడాదిలో ఐదు రోజులు నగ్నంగా ఉంటున్నారు. ఆ ఐదు రోజులు వారు బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు. పురుషులే కాదు.. స్త్రీలు కూడా వారిని చూడరు.

శ్రావణ మాసంలో ఎక్కువగా సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు లహువా దేవతకు పూజలు చేస్తారు. లహువా దేవత గ్రామాన్ని చెడు నుంచి రక్షిస్తుందని, తమను కంటికి రెప్పలా కాపాడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల కొంతమంది మహిళలు పూర్తిగా నగ్నంగా కాకుండా.. పలుచని దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఐదు రోజుల పాటు మహిళలు ఎలాంటి వేడుకల్లో పాల్గొనకూడదు. ఆ సమయంలో నగ్నంగా ఉన్న మహిళతోపాటు మరెవ్వరూ నవ్వకూడదు. ఒకవేళ నవ్వితే దేవతల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు.

Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Naked Culture Women Naked in Himachal Pradesh Naked in Pini Pini Naked Culture Manikarna valley నగ్న సాంప్రదాయం

సంబంధిత కథనాలు

Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో!

Ghost In Bar: బారులో బూచీ.. అంతా చూస్తుండగానే బీరు గ్లాసును పడేసిన దెయ్యం.. ఇదిగో వీడియో!

Pakistan Train Driver: పెరుగు కోసం రైలు ఆపేసిన ట్రైన్ డ్రైవర్.. వీడియో వైరల్

Pakistan Train Driver: పెరుగు కోసం రైలు ఆపేసిన ట్రైన్ డ్రైవర్.. వీడియో వైరల్

Bold Trend: బ్లౌజ్ లేదు, కానీ ఉన్నట్టే లెక్క... అదే ‘మెహెందీ బ్లౌజ్’

Bold Trend: బ్లౌజ్ లేదు, కానీ ఉన్నట్టే లెక్క... అదే ‘మెహెందీ బ్లౌజ్’

Secrets: అన్ని విషయాలు అందరితో చెప్పేయకండి... వీటిని రహస్యంగా ఉంచండి

Secrets: అన్ని విషయాలు అందరితో చెప్పేయకండి... వీటిని రహస్యంగా ఉంచండి

Bone Soup Benefits: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

Bone Soup Benefits: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

టాప్ స్టోరీస్

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు