Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
'కూ' యాప్ ద్వారా వినియోగదారులు తమ అభిప్రాయాలను మరింత స్వేచ్ఛగా, సౌకర్యవంతంగా పంచుకోవచ్చని సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా అన్నారు.
![Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా' Koo App Is An Inclusive Platform Makes You Feel Your Opinion Matters: Co-Founder Mayank Bidawatka Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/7429e7f8cb7c6d9366ef344e2cb6b7cd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'కూ'.. భారత్‌కు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక. చైనా, అమెరికాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లతో పోలిస్తే కూ యాప్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునేందుకు అద్భతమైన వేదికను కల్పించింది 'కూ'.
అలాంటి కూ యాప్‌లో విశేషాలు, భారత్‌లో ఎదుగుతున్న తీరు సహా మరిన్ని విశేషాలను 'ఏబీపీ'తో పంచుకున్నారు 'కూ' కో-ఫౌండర్ మయాంక్ బిదావత్కా.
స్వేచ్ఛగా..
'కూ' అనేది వినియోగదారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు ఓ అద్భుతమైన వేదికగా బిదావత్కా పేర్కోన్నారు. ఎలాంటి అంశంపైనైనా తమ అభిప్రాయాన్ని 'కూ'లో పంచుకోవచ్చని, మిగిలినవారు దానిపై స్పందించవచ్చన్నారు. ట్విట్టర్‌తో పోలిస్తే 'కూ' ఔట్‌లుక్ చాలా విభిన్నంగా ఉంటుందన్నారు.
2020 మార్చి నెలలో 'కూ' యాప్‌ను ప్రారంభించారు. ఇది ప్రారంభించడానికి ప్రధాన కారణం భారత ప్రజలేనని బిదావత్కా అన్నారు.
ఇదే తేడా..
ఇన్-డెప్త్ ట్రాన్స్‌లేషన్ టూల్స్, సహా తమ సొంత భాషలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ప్రస్తుత సమాజంలో అవసరమని మయాంక్ అన్నారు. చైనీస్, అమెరికన్ యాప్‌లలో ఇదే లోపించిందని అందుకే 'కూ' సోషల్ మీడియా వేదికల్లో ప్రత్యేకంగా నిలిచిందన్నారు.
రాజకీయ నేతలు..
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో 'కూ'ను రాజకీయ నేతలు ఎలా వినియోగిస్తున్నారనే ప్రశ్నకు మయాంక్ బదులిచ్చారు.
బ్యాన్ చేస్తారా?
వినియోగదారులు ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే వారి ఖాతాను బ్యాన్ చేయడంపై మయాంక్ భిన్నంగా స్పందించారు. వినియోగదారుల ఖాతాలను ట్విట్టర్ బ్యాన్ చేసినట్లు 'కూ'లో చేయబోమని స్పష్టం చేశారు. బ్యాన్ చేయడం కంటే వినియోగదారుల వ్యాఖ్యలు గౌరవప్రదంగా ఉండాలని 'కూ' కోరుకుంటుందన్నారు.
గోప్యతలో పక్కా..
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో గోప్యతపై ఎక్కువ ఆందోళన నెలకొంది. వినియోగదారులు కూడా తమ గోప్యతకు భంగం కలగకూడదని కోరుకుంటున్నారు.డేటా చోరీని తీవ్రంగా పరిగణిస్తారు. 'కూ'లో వినియోగదారులు తమ డేటా, గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మయాంక్ హామీ ఇచ్చారు.
భారత్‌కు చెందిన గొప్ప ఎథికల్ హ్యాకర్లు 'కూ' యాప్ భద్రత కోసం పనిచేస్తున్నారని మయాంక్ అన్నారు. ప్రస్తుతం 'కూ' యాప్ 8 భాషల్లో లభ్యమవుతుందని, రాజకీయం, సినిమా, క్రీడల ప్రముఖుల నుంచి సాధారణ పౌరుల వరకు 'కూ'ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
విస్తరణ..
త్వరలోనే 'కూ' యాప్‌ను మరిన్ని దేశాలకు విస్తరించే పనిలో ఉన్నట్లు మయాంక్ వెల్లడించారు. చివరిగా 'కూ' ద్వారా వినియోగదారులు తాము ఇష్టపడే భాషలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చని మయాంక్ పేర్కొన్నారు.
Also Read: Primary Health Care: ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Also Read: Farm Laws Repeal: వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం.. తొలిరోజే సభకు!
Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!
Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)