అన్వేషించండి

Amma Rajasekhar: స్పృహ తప్పి పడిపోయిన 'అమ్మ' రాజశేఖర్... తనయుడి 'తల' కోసం తట్టుకుని మళ్లీ... ఇప్పుడు ఆయన హెల్త్ ఎలా ఉందంటే?

Amma Rajasekhar : కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ 'తల' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు ఆయన హెల్త్ ఎలా ఉందంటే?

అమ్మ రాజశేఖర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు కూడా అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తన వారసుడిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. 'తల' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి స్వయంగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే తెరపైకి రాబోతున్న ఈ మూవీ ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ స్పృహ తప్పి పడిపోయారు. 

స్పృహ తప్పి పడిపోయిన అమ్మ రాజశేఖర్ 
దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త మూవీ 'తల'. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ మూవీతో చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో అంకిత నస్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రోహిత్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఎస్తేర్ నోరాన్హ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్యామ్ కే నాయుడు ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించగా, ధర్మ తేజ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. 

ఈ నేపథ్యంలోనే మేకర్స్ 'తల' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ విఎన్ ఆదిత్య గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగానే అమ్మ రాజశేఖర్ స్పృహ తప్పి పడిపోవడంతో, కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడున్న వారు వెంటనే ఆయన వద్దకు చేరుకొని, సపర్యలు చేయడంతో అమ్మ రాజశేఖర్ కాసేపటికి తిరిగి నార్మల్ అయ్యారు. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ ఈవెంట్ లో స్పృహ తప్పి పడిపోయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

Also Readప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్

దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ జర్నీ 
ఇదిలా ఉండగా, అమ్మ రాజశేఖర్ తన తల్లి మీద ప్రేమతో 'అమ్మ' అనే పదాన్ని పేరుకు ముందు పెట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారారు. 2006లో గోపీచంద్ తో అమ్మ రాజశేఖర్ తెరకెక్కించిన 'రణం' మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు కొరియోగ్రాఫర్ గా, చేస్తూనే మరోవైపు డైరెక్టర్ గా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. 'రణం' తర్వాత రవితేజతో 'ఖతర్నాక్' అనే సినిమాను చేశారు అమ్మ రాజశేఖర్. కానీ ఈ మూవీ ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు. ఇక కొరియోగ్రాఫర్, డైరెక్టర్ గానే కాదు హీరో గానూ  అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అమ్మ రాజశేఖర్. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ 4లో 11వ కంటెస్టెంట్ గా అమ్మ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం గ్యాప్ తర్వాత తన కొడుకుని హీరోగా పెట్టి 'తల' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్.

Also Read: సౌత్ క్వీన్ త్రిషను టార్గెట్ చేసిన హ్యాకర్లు... క్రిప్టో కరెన్సీ పోస్టులపై అభిమానులను అలర్ట్ చేసిన హీరోయిన్

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget