Trisha: సౌత్ క్వీన్ త్రిషను టార్గెట్ చేసిన హ్యాకర్లు... క్రిప్టో కరెన్సీ పోస్టులపై అభిమానులను అలర్ట్ చేసిన హీరోయిన్
Trisha : త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టా గ్రామ్ వేదికగా ప్రకటించింది.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కావడం ఆమె అభిమానులను ఆందోళనలో పడేసింది. సడన్‌గా త్రిష ట్విట్టర్ అకౌంట్‌లో క్రిప్టో కరెన్సీ పోస్టులు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే త్రిష తన ట్విట్టర్ హ్యాక్ అయ్యింది అనే విషయాన్ని మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో వెల్లడించింది.
త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్...
త్రిష కృష్ణన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్‌ను స్కామర్లు హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన తర్వాత ఆమె తన సొంత కరెన్సీ లైన్ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తూ, ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే దాన్ని డిలీట్ చేశారు. ఆ పోస్టులో త్రిష తన కుక్క పిల్లతో కలిసి ఉన్న ఫోటో ఉంది. ఆ పోస్ట్ చేస్తూ "నా కొత్త కరెన్సీ $krishnan ఇప్పుడు అందుబాటులో ఉంది" అని రాస్కొచ్చారు. అంతే కాకుండా దానికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ లింకును కూడా పోస్ట్ చేశారు.
ఈ విషయాన్ని గమనించిన త్రిష వెంటనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అసలేం జరిగిందో ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో "నా ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. ఏం పోస్ట్ చేసినా దాన్ని సరిదిద్దే వరకు నా నుంచి వచ్చిన పోస్ట్ కాదు. థాంక్స్" అంటూ అభిమానులను అలర్ట్ చేసింది. అయితే త్రిష సోషల్ మీడియా ఎకౌంట్ హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాగే జరగ్గా, త్వరగానే ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌ను హ్యాకర్ల చేతి నుంచి రక్షించుకోగలిగింది.
Also Read: మా తాతయ్య మహా రసికుడు... మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్‌పై ట్రోలింగ్
సీనియర్ హీరోలకు కేరాఫ్ అడ్రస్...
త్రిష సినిమాల విషయానికి వస్తే... ఆమె సీనియర్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రీసెంట్ గా అజిత్ కుమార్ తో కలిసి 'విడా మయుర్చి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో 'పట్టుదల' పేరుతో ఈ మూవీని రిలీజ్ చేశారు. తెలుగులో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఫరవాలేదు అనిపించింది. కయల్, అర్జున్ అనే భార్యాభర్తల స్టోరీతో ఈ మూవీ నడుస్తుంది. విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన భార్యని అర్జున్ ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయాణం మొదలు పెడతాడు. కానీ మధ్యలోనే ఆమె కిడ్నాప్ కావడంతో, భార్యను రక్షించుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటాడు హీరో. ఫిబ్రవరి 6న రిలీజ్ అయిన ఈ మూవీని అమెరికన్ సినిమా 'బ్రేక్ డౌన్' నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీలో త్రిష కృష్ణన్ తో పాటు అర్జున్ సర్జా, రెజీనా కెసండ్రాతో పాటు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. త్రిష ఖాతాలో ప్రస్తుతం చిరంజీవితో కలిసిన నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'విశ్వంభర', కమల్ హాసన్ పాన్ ఇండియా మూవీ 'థగ్ లైఫ్' లాంటి భారీ సినిమాలు ఉన్నాయి.
Also Read: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్





















