అన్వేషించండి
Advertisement
Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!
వాట్సాప్ మెసేజ్‌లను డిలీట్ చేసే సమయాన్ని పెంచేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ మన రోజువారి జీవితంలో భాగమైపోయింది. ఇలా తెల్లారిందో లేదో.. అలా వాట్సాప్ ముఖం చూసేవాళ్లే ఎక్కువ. అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది వాట్సాప్.
ఆ టైమ్ కోసం..
వాట్సాప్‌లో 'Delete For Everyone' సమయాన్ని పెంచేందుకు సంస్థ ఆలోచిస్తోంది. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తే అది డిలీట్ చేసేందుకు ఒక గంట 8 నిమిషాల 16 సెకన్ల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమయాన్ని 7 రోజుల 8 నిమిషాలకు పెంచేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్‌ను ముందుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు తర్వాత ఐఓఎస్ వాళ్లకు ఇవ్వనుంది వాట్సాప్.
" గంట 8 నిమిషాల 16 సెకన్ల కంటే ముందు పెట్టిన మెసేజ్‌ను మాత్రమే ప్రస్తుతం డిలీటే చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయాన్ని 7 రోజుల 8 నిమిషాలకు పెంచేలా త్వరలోనే అప్‌డేట్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. అధికారిక ప్రకటన వచ్చేలోపు దీనిపై మార్పులు కూడా జరగొచ్చు. "
-వాట్సాప్ ట్రేకర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion