Dating App: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
డేటింగ్ యాప్ లు కేవలం జంటను వెతుక్కోవడం కోసమే అనుకుంటారు... కానీ ఒకేలాంటి ఆలోచనలు కలిగిన వారిని కలపడం కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి.
పాశ్చాత్యదేశాల్లో డేటింగ్ యాప్‌లకు ఆదరణ ఎక్కువ. ఒక్కో డేటింగ్ యాప్ లో వేలకు వేల మంది సభ్యులు ఉంటారు. ఆ యాప్ ద్వారా పరిచయమై ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నవాళ్లూ ఉంటారు. అలాగే కొన్నాళ్లు కలిసి ఎంజాయ్ చేసి ఎవరి దారి వారు చూసుకున్నవాళ్లు ఎందరో. సాధారణంగా అన్ని డేటింగ్ యాప్ ల పని ఒక్కటే... జంటను వెతికిపెట్టడమే. కానీ మరో డేటింగ్ యాప్ వచ్చింది. దీనిలో చేరాలంటే మాత్రం ప్రధాన అర్హత... వారికి సెక్స్ అంటే ఆసక్తి ఉండకూడదు. ఆ ఆసక్తి ఉన్నవారెవరూ ఈ డేటింగ్ యాప్ లో నమోదు చేయించుకోరాదు. ఈ డేటింగ్ యాప్ పేరు ‘ద సెక్స్‌లెస్ ట్రైబ్’. అమెరికాకు చెందిన 33 ఏళ్ల షకియా సీబ్రూక్. ఆమెకు కూడా సెక్స్ లైఫ్ అంటే ఇష్టం లేదు. అందుకే పెళ్లి జోలికి వెళ్లలేదు.
దేవుడు చెప్పాడు
షకియాకు దేవుడంటే నమ్మకమెక్కువ. దేవుడే తనకు ఈ దారి చూపించాడని, అందుకే ఇలా ఓ డేటింగ్ యాప్‌ను ప్రారంభించినట్టు మీడియాకు తెలిపింది షక్రియా. తనలాగ లైంగికాసక్తి లేనివాళ్లు చాలా మంది ఉన్నారని, వారందరి కోసం ఏదైనా చేయాలనిపించిందని చెప్పింది షక్రియా. అలాంటివాళ్ల కోసం మొదట్లో టీషర్టులు ప్రత్యేకంగా రూపొందించి అమ్మింది. కానీ అది చాలదనిపించింది. ఓ కమ్యూనిటీని ప్రారంభించాలనుకుంది. అలా పుట్టిందే ‘ద సెక్స్‌లెస్ ట్రైబ్’. ఆ కమ్యూనిటీ కోసం ఓ డేటింగ్ యాప్ అవసరం కనిపించింది షకియాకు. ఎందుకంటే సెక్స్ వద్దనే పార్టనర్ ను ఎవరూ కోరుకోరు. దీంతో లైంగికాసక్తి లేని తన లాంటి వాళ్లు తోడు లేకుండా మిగిలిపోతున్నారు. అందుకే ఈ డేటింగ్ యాప్ ను ప్రారంభించింది. ఇందులో సెక్స్ వద్దని కోరుకునే వాళ్లు మాత్రమే సభ్యత్యం తీసుకోవాలి.
వేల మంది...
యాప్ ప్రారంభించిన కొత్తలో వంద మంది చేరినా చాలనుకుంది షకియా. కానీ ఆశ్చర్యం 8,000 మంది చేరారు. అందులో చాలా మంది జంటలుగా మారారు. స్నేహితుల్లా ఒకే ఫ్లాట్ లో ఒకరికొకరు తోడుగా బతుకుతున్నారు. అలాగే ఈ కమ్యూనిటీ అంతా కలిపి రకరకాల ఈవెంట్లు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు.
Also read: భార్య పుట్టినరోజు మర్చిపోతే నేరమే, అరెస్టు కూడా తప్పకపోవచ్చు, ఎక్కడంటే...
Also read: పెళ్లంటే భయపడుతున్నారా? అయితే మీకు ఈ ఫోబియా ఉన్నట్టే...
Also read: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...