అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
పార్లమెంట్ ఆవరణలో ఇండీ కూటమి ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనల కారణంగా సభలు వాయిదా పడ్డాయి. అయితే...ఈ ఆందోళనల్లో భాగంగా ఇండీ కూటమి ఎంపీలు పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద గోడలు ఎక్కారు. ఆ గోడపై నిలబడి ప్లకార్డులు పట్టుకుని అమిత్ షాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే..ఈ ఆందోళనల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టి వేయగా..ఆయన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్రపై పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. వీల్ చైర్‌లో ఆయనను హాస్పిటల్‌కి తరలిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే...తోపులాటపై రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీలు నిలదీశారు. బ్లూ టీషర్ట్ వేసుకుని పార్లమెంట్‌కి వచ్చిన రాహుల్ గాంధీపై..మండి పడ్డారు. ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీజేపీ ఎంపీలు కూడా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. మొత్తంగా పార్లమెంట్...నిరసనలు, నినాదాలతో మారుమోగిపోయింది.