అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆల్‌రౌండర్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. గబ్బా టెస్ట్ జరుగుతుండగానే ఈ అనౌన్స్ చేశాడు. అంతకు ముందు కోహ్లీతో చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. అయితే...అశ్విన్ రిటైర్‌మెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైమ్‌లో రిటైర్ అవ్వాల్సిన అవసరమేంటని కొందరు ప్రశ్నిస్తుంటే...తనకి సరైన గౌరవం దక్కలేదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో పెట్టాడు. ఈ వీడియోలోనే అశ్విన్ రిటైర్‌మెంట్ గురించి మాట్లాడాడు. ఇంత క్రూషియల్ టైమ్‌లో అశ్విన్ ఎందుకు రిటైర్ అయ్యాడో అర్థం కాలేదని అన్నాడు. అంతే కాదు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ పూర్తయ్యేంత వరకూ ఉండాల్సిందని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ అతణ్ని కన్విన్స్ చేసుంటే బాగుండేదనీ చెప్పాడు. లేదంటే..అశ్విన్ న్యూజిలాండ్‌తో టెస్ట్ జరిగిన సమయంలోనే రిటైర్ అవ్వాల్సిందనీ అన్నాడు. తన అవసరం ఎంత ఉందో చెప్పి ఉంటే ఈ డిసిషన్ తీసుకునే వాడే కాదని అసహనం వ్యక్తం చేశాడు బసిత్ అలి. ఇదే సమయంలో అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు. అశ్విన్ కేవలం మ్యాచ్ విన్నర్ మాత్రమే కాదని. సిరీస్ విన్నర్ అని పొగిడాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో హర్భజన్, అనిల్ కుంబ్లే స్థాయిలో అశ్విన్ రాణించాడని వీళ్లంతా సిరీస్ విన్నర్సేనని ప్రశంసించాడు బసిత్ అలీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.