అన్వేషించండి

Marraige: పెళ్లంటే భయపడుతున్నారా? అయితే మీకు ఈ ఫోబియా ఉన్నట్టే...

సంపూర్ణ జీవితంలో పెళ్లి కూడా ఒక భాగమే. కానీ పెళ్లంటే భయపడే యువత సంఖ్య పెరిగిపోతోంది.

పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ, మనసులో ఒక మూల ఏదో భయం. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో? ఎన్నికష్టాలు పడతానో? అసలు నేను పెళ్లికి ఫిట్‌నా కాదా? సంసార సాగరాన్ని ఈదగలనా? ఇలా చాలా అనుమానాలు పెళ్లి వయసు యువతలో పెరిగిపోతున్నాయి. అందుకే మన చుట్టూ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. ఇలా పెళ్లంటే భయపడడాన్ని ‘గామోఫోబియా’ అంటారు. ఇది ఉన్న వాళ్లు ఒకరికి కమిటిమెంట్ ఇచ్చేందుకు చాలా భయపడతారు. 

గామో ఫోబియాకు కారణం....
ఇదేమి వారసత్వంగా వచ్చేది కాదు. ఇంట్లో లేదా చుట్టుపక్కల కుటుంబాలలో భార్యాభర్తల గొడవలు, కుటుంబాన్ని పోషించలేక ఆ ఇంటి పెద్ద పడే కష్టాలు చూసి పుట్టుకొచ్చేదే. చిన్నప్పట్నించి నిత్యం గొడవలు జరిగే కుటుంబంలో పెరిగిన బిడ్డ పెద్దయ్యాక ఈ ఫోబియా బారిన పడే  అవకాశం ఎక్కువ. ఈ భయాన్ని ఒక మానసిక సమస్యగా చెప్పవచ్చు. ఈ ఫోబియా ఉన్న వాళ్లకి ఒకరితో అనుబంధం ఏర్పరచుకునేకన్నా, ఒంటరిగా బతకడమే మేలనిపిస్తుంది. అందుకే పెళ్లి పేరు ఎత్తితే చాలు భయపడతారు. వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ తమకున్న భయాలను మాత్రం బయటకు చెప్పుకోరు.  

పెళ్లంటే భయపడేవారు ఇలా చేయండి
పెళ్లంటే భయమేస్తుందని బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది. దీనివల్ల సరైన వయసులో పెళ్లి కాకుండా ముదిరిపోతున్నారు. కాస్త ప్రయత్నిస్తే గామో ఫోబియా నుంచి బయటపడచ్చు. వైద్యుల వద్దకు కౌన్సిలింగ్ కు వెళితే చాలా మంచిది. అలాగే పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. 

1. ప్రపంచంలో పెళ్లి చేసుకోని వాళ్ల కన్నా, పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్యే ఎక్కువ. పెళ్లిని భారంగా కాకుండా ప్రకృతిలో, సృష్టిలో ఒక భాగంగా చూడండి. 

2. పెళ్లి తరువాత చాలా మార్పులు జరిగిపోతాయని మీకు మీరే ఊహించుకోకండి. ఏదీ మారదు, భాగస్వామిని కలుపుకుపోతూనే మీకు నచ్చినట్టుగా మీరు జీవించేలా ప్లాన్ చేసుకోవచ్చు. 

3. పెళ్లిని దూరం చేసుకుని, మీ వారసులను మీరు చూసుకునే అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. 

4. పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్న జంటల మధ్య రోజూ కొంతసేపు గడుపుతూ ఉండండి. 

5. గామో ఫోబియాను మనసులోంచి తరిమికొట్టే థెరపీలు ఉన్నాయి. ఆ థెరపీలు చేయించుకుంటే సంసారసాగరాన్ని ఈదగలననే ధైర్యం పెరుగుతుంది.   

Also read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి

Also read: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...

Also Read : షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget