By: ABP Desam | Updated at : 20 Nov 2021 09:42 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
కరోనా కేసులు తగ్గి ఉండవచ్చు, కానీ ప్రమాదం ఇంకా పొంచే ఉంది. ఎప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందనే భయం ఇంకా ప్రజల్ని వీడలేదు. ఈ సమయంలో అమెరికాలో చేసిన ఓ అధ్యయనం కలవరం రేపుతోంది. డెల్టా వేరియంట్ వచ్చాక గర్భస్థ శిశు మరణాలు, ప్రసవంలో శిశుమరణాల రేటును పెంచిందని ఆ అధ్యయనం తెలియజేస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం కోవిడ్ లేనివారితో పోలిస్తే, కోవిడ బారిన పడిన గర్భిణుల్లో చనిపోయిన శిశువును ప్రసవించే అవకాశం లేదా, ప్రసవించిన కొన్ని నిమిషాల్లో శిశువు చనిపోయే శాతం నాలుగు రెట్లు పెరిగిందని తేలింది. ఈ అధ్యయనాన్ని అమెరికా ప్రభుత్వం నిర్వహించింది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం మార్చి 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య అమెరికాలో దాదాపు 12 లక్షల కంటే ఎక్కువ ప్రసవాలు జరిగాయి. వాటిలో 8,154 ప్రసవాల్లో శిశుమరణాలు సంభవించాయి. వాటిలో కూడా డెల్టా వేరియంట్ రాకముందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లులకు పుట్టిన శిశువుల్లో మరణాలు తక్కువగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో బాధపడుతున్న గర్భిణుల్లో మాత్రం శిశుమరణాలు అధికంగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ వల్ల శిశు మరణాల రేటు నాలుగు రెట్లు పెరిగినట్టు లెక్క తేల్చింది అమెరికా ఆరోగ్య సంస్థ.
కారణం ఇదేనా?
డెల్టా వేరియంట్ సోకిన తల్లులకు పుట్టిన శిశువుల మరణానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు. కరోనా వల్ల శిశువు శరీరంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉండడమో లేక ప్లాసెంటాకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమో కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
పసిప్రాణానికి ఎన్ని కష్టాలో...
కోవిడ్ 19 బారిన పడిన తల్లులకు జన్మించిన శిశువుల్లో అధికరక్తపోటు, గుండె సమస్యలు, సెప్సిస్, రక్త ప్రవాహం సరిగా జరగకపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి బయటపడ్డాయి. ఆ బిడ్డలని పుట్టిన వెంటనే చాలా రోజుల పాటూ వెంటిలేటర్ పై ఉంచాల్సి రావడం, ఐసీయూలో చేర్చించి చికిత్స చేయించాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. డెల్టావేరియంట్ గర్భస్థ శిశువుకు ముప్పుగా మారడం నిజంగా కలవరపెట్టే అంశమేనని అభిప్రాయపడ్డారు పరిశోధకులు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: రోజూ గోడకుర్చీ వేయండి, గుంజీలు తీయండి... ఇవి చేస్తే చాలు ఆ సమస్యలు దూరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Cancer Risk: ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఆడవాళ్ల కన్నా మగవారిలోనే ఎక్కువ
ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు
Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో
Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!