Formula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desam
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కార్ రేస్ లో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ అవినీతి నిరోధ శాఖ - ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ తో పాటు మరో రెండు సెక్షన్లు కింద ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. పెట్టిన నాలుగు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కావటంతో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం మొదలైంది. కేసులో A1 కేటీఆర్ పేరే ఎఫ్ ఐఆర్ లో రిజిస్టర్ చేశారు. అసలేంటీ ఈ కార్ రేస్. కేటీఆర్ ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నారు..ఈ వీడియోలో చూద్దాం.
2023 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఇ-రేస్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయింది. కేటీఆర్ ప్రత్యేకంగా చొరవ చూపించి ఈ రేస్ పెట్టించారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. ఏదో గొప్ప పని చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు కానీ...ఇదంతా జంతర్ మంతర్ అని కాంగ్రెస్ బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ అయ్యి..గవర్నర్ నుంచి అనుమతి తెచ్చుకుని కేసు కూడా పెట్టింది. కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది.
ఈ కార్ రేస్ లో వివాదం ఏం లేదని బీఆర్ఎస్ క్లారిటీ ఇస్తూ ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది. కేటీఆర్ కూడా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను చర్చ పెట్టండని స్పీకర్ కు లేఖ కూడా రాశారు. అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటో ఓ సారి చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఎంకరేజ్ చేసేందుకు పదేళ్లుగా పలు దేశాల్లో ఫార్ములా E రేస్ జరుగుతోంది. అలా మొట్టమొదటి సారి భారత్‌లో..అదీ హైదరాబాద్‌లో..E రేస్ జరిగింది. లండన్, బీజింగ్, జకార్తా సహా లాంటి నగరాల్లో జరిగిన రేస్‌ని.. హైదరాబాద్‌లో తొలిసారి కండక్ట్ చేశారు. ఈ రేస్ ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు టూరిజం సెక్టార్ కూడా డెవలప్ అవుతుంది. హైదరాబాద్‌ని తెలంగాణ గ్రీన్ కవర్‌గా మార్చి..ఈ రేస్‌ని తీసుకొచ్చిన ఘనత అంతా అప్పటి మంత్రి కేటీఆర్‌దే..! ఇదంతా BRS వర్షన్.
అసలు వివాదమేంటి..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన E రేస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సక్సెస్ అవడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ మరోసారి రేస్ నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అప్పట్లో HMDA 55 కోట్ల నిధులనూ విడుదల చేసింది. దీనిపైనే ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. అసలు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే... ఈ నిధులు రిలీజ్ చేసి ఇచ్చారని ఆరోపిస్తోంది. నిధుల కేటాయింపులో ఏదో మతలబు జరిగిందని, అదేంటో కచ్చితంగా బయటపెడతామని చెప్పటంతో పాటు కేసును అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ట్రాన్సఫర్ చేసింది.
అంతే కాదు. విదేశీ సంస్థకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసిన విషయంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్. RBI గైడ్‌లైన్స్ పాటించలేదనీ అంటోంది. పైగా అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నా దాన్నీ లెక్క చేయకుండా ఫండ్స్ ఇచ్చారనీ ఆరోపించింది. అందుకే..ఈ మొత్తం వ్యవహారంపై ACBకి ఫిర్యాదు చేసింది. మొత్తానికి...ఈ వివాదం గవర్నర్‌కి ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లింది. కేటీఆర్‌పై కేసు పెట్టేందుకు అనుమతినివ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మని కోరింది ఏసీబీ. ఇటీవలే ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ACB కేటీఆర్‌పై కేసు కూడా పెట్టింది. సో ఈ 55 కోట్ల అవినీతి కేసులో కేటీఆర్ చిక్కుకుపోయారన్నమాట. ACB ఏ1 గా కేసు పెట్టింది కాబట్టి అధికారుల దగ్గర అవినీతి జరిగింది అనటానికి బలమైన ఆధారాలు ఉండి ఉంటాయి.మరి ఈ కేటీఆర్ ఈ టఫ్ సిచ్యుయేషన్ ను ఎలా ఫేస్ చేస్తారు. లీగల్ గా ఎలా బ్యాటిల్ చేస్తారు చూడాలి. మొన్న కవిత లిక్కర్ కుంభకోణం..ఈరోజు కేటీఆర్ ఈ కార్ రేస్..ఇప్పుడైనా గులాబీ అధినేత కేసీఆర్ పాలిటిక్స్ లో యాక్టివేట్ అవుతారేమో చూడాలి.