అన్వేషించండి

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Andhra News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి పనులకు ఆమోదం సహా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపింది.

AP Cabinet Key Decisions: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రి పార్థసారథి (Minister Parthasaradhi) వివరాలు వెల్లడించారు. రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులు ఇవ్వగా.. 45 ఇంజినీరింగ్ పనులు రూ.33,137 కోట్లతో పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. డోన్, ఉద్దానం, పులివెందులలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్థిరమైన నీటి వనరుల వినియోగం ద్వారా తాగునీటి వసతి ఇవ్వాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని.. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి పార్ధసారధి తెలిపారు. చిన్న రాష్ట్రాలు కూడా రూ.లక్ష కోట్లకు పనులు చేసుకున్నాయని చెప్పారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులను పునఃపరిశీలిస్తామన్నారు. అనంతరం ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలివే..

  • అమరావతిలో మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అలాగే, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణానికి ఆమోదం.
  • బుడమేరు, 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు సర్కారు ఆమోదం.
  • ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌‍ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం, పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి.
  • పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు అనుమతి.
  • క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు. దీని ద్వారా 1.06 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
  • రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర పర్వదినంగా రథసప్తమి

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని రాష్ట్ర స్థాయి పర్వదినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రథసప్తమితో పాటే 3 రోజులు పర్వదినంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. కాగా.. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరగనుండగా.. దేవస్థానం వేడుకలు నిర్వహిస్తుందని వెల్లడించింది.

మంత్రులకు సీఎం కీలక సూచన

అటు, సున్నిత అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసే వారుంటారని అన్నారు. ఢిల్లీలో అంబేడ్కర్ విషయమై జరిగిన వ్యవహారం కూడా ఈ తరహాలోనిదేనని చెప్పారు. ఈ పరిణామాలపై మంత్రులతో చర్చించారు. 'గతంలో వ్యవసాయం దండగ అనకున్నా.. అన్నట్లుగా నాపై తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు తగిన గౌరవం లభించలేదు. అంబేడ్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఎవరి ద్వారా అంబేడ్కర్‌కు గుర్తింపు వచ్చిందనే దానిపై చర్చించాలి.' అని అమాత్యులకు సూచించారు.

Also Read: Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కేసులు నమోదు చేయాలంటున్న భక్తులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget