అన్వేషించండి
Intercourse Wellness in India: భారత్‌లో సెక్సువల్ వెల్నెస్ ఉత్పత్తులలో విప్లవాత్మక మార్పులు, తొలుగుతున్న అపోహలు
Health Tips in Telugu | భారత్ లో సెక్సువల్ వెల్నెస్ ఉత్పత్తులలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి, సెక్సువల్ వెల్నెస్ పై ఉన్న అపోహలను తొలగిస్తూ, ప్రజలకు అవగాహన పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భారత్‌లో సెక్సువల్ వెల్నెస్ ఉత్పత్తులలో విప్లవాత్మక మార్పులు
1/6

భారతదేశంలో ఇప్పటివరకు సంస్కృతి, సంప్రదాయాల పేరుతో గోప్యంగా మిగిలిపోయిన సెక్సువల్ వెల్నెస్ అంశం ఇప్పుడు ఓపెన్‌గా చర్చకు వస్తోంది. ఇటీవల డ్యూరెక్స్ (Durex), మై మ్యూస్ (My Muse), కైండ్లీ (Kindly), బోల్డ్‌కేర్ (Bold Care), స్విష్ (Svish) వంటి బ్రాండ్లు సెక్యువల్ వెల్నెస్ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
2/6

సెక్సువల్ వెల్నెస్ కు సంబంధించి వ్యక్తిగత సుఖం, రిప్రొడక్టివ్ హెల్త్ (Reproductive Health)వంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా, ఈ ఉత్పత్తులు మరింత సులభంగా వినియోగ దారులకు అందుబాటులోకి వచ్చాయి.
3/6

వ్యక్తిగత ఆనందం కోసం పర్సనల్ మసాజర్లు: సెక్సువల్ వెల్నెస్ ఉత్పత్తుల్లో ముఖ్యమైన వాటిలో పర్సనల్ మసాజర్లు (Intimate massagers) అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణ కు మై మ్యూస్ బీట్ మసాజర్ (My Muse Beat Massager), స్వాకమ్ అలెక్స్ నీయో వంటి ఉత్పత్తులు శృంగార అనుభూతిని మెరుగుపరచేందుకు రూపొందించబడ్డాయి. ఇవి పురుషులకే కాకుండా, మహిళలు మరియు ఇతర లింగాలకు (other genders) కూడా ఉపయోగపడతాయి. ఈ ఉత్పత్తులు శారీరక అనుభూతిని మరింత ఆనందదాయకంగా, సురక్షితంగా మార్చే ఫీచర్లు కలిగి ఉంటాయి.
4/6

బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ (Swiggy Instamart) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ ఉత్పత్తులు కొన్ని నిమిషాల్లోనే వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్ వినియోగదారుల గోప్యతను పరిరక్షిస్తూ, డిస్క్రీట్ ప్యాకేజింగ్ (discreet packaging) ద్వారా ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి.
5/6

సెక్సువల్ హైజీన్ కోసం డిలే వైప్స్, లూబ్రికెంట్లు: బోల్డ్‌కేర్ డిలే వైప్స్ (Bold Care Delay Wipes), స్విష్ ఇంటిమేట్ వెట్ వైప్స్ (Svish Intimate Wet Wipes) వంటి ఉత్పత్తులు సెక్సువల్ హైజీన్ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వైప్స్ సెక్సువల్ హైజీన్‌ను ప్రోత్సహిస్తూ, సురక్షితమైన అనుభూతిని అందిస్తాయి. సెక్సువల్ అనుభూతిని మెరుగుపరచే ఇంకో ముఖ్యమైన ఉత్పత్తి లూబ్రికెంట్లు (lubricants). డ్యూరెక్స్ ప్లే లూబ్రికెంట్ (Durex Play Lubricant), కైండ్లీ నేచురల్ లూబ్రికెంట్ వంటి ఉత్పత్తులు శృంగారాన్ని సాఫీగా చేయడంలో సహాయపడుతున్నాయి. రకరకాల ఫ్లేవర్లలో (flavors) అందుబాటులో ఉన్న ఈ లూబ్రికెంట్లు కపుల్స్ మధ్య ఫిజికల్ సంబంధాలను మరింత సౌఖ్యంగా, ఆనందకరంగా మార్చేందుకు తోడ్పడతాయి అని తయారీదారులు చెబుతున్నారు.
6/6

సమాజంలో సెక్సువల్ వెల్నెస్ పై అవగాహన: ఈ సరికొత్త ఉత్పత్తులు కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా సెక్సువల్ వెల్నెస్ పై అవగాహనను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఉత్పత్తులు కేవలం వ్యక్తిగత ఉపయోగానికి మాత్రమే కాకుండా, భారతదేశంలో సెక్సువల్ వెల్నెస్ గురించి అవగాహన తీసుకువస్తున్నాయి. ఆరోగ్యకరమైన సంబంధాలు, సురక్షితమైన శృంగార అనుభూతిని పెంచడంలో దోహదం చేస్తున్నాయి. అదే విధంగా సమాజంలో సెక్సువల్ వెల్నెస్ పై ఉన్న అపోహలను క్రమంగా తొలగిస్తూ, ప్రజలకు మరింత అవగాహన పెంచే దిశగా ఈ ప్రొడక్ట్స్ ను రూపొందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Published at : 11 Dec 2024 12:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion