ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కేవలం 22 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ వరుసగా ఏడో మూడో ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తో సహా అన్ని జాతీయ రాజధాని ఏరియా (NCR) సరిహద్దు రాష్ట్రాలను ఓ పార్టీ పాలించడం 4 దశాబ్దాలలో ఇదే మొదటిసారి.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి విఫలమైంది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపగా, కేవలం ముగ్గురికి మాత్రమే డిపాజిట్ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 67 మంది కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. షీలా దీక్షిత్ నేతృత్వంలో 1998 నుంచి వరుసగా 3 టర్మ్ లు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీ రాజకీయాలు మారిపోయాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక్కరూ గెలవలేదు. 2020 ఎన్నికలతో పాటు, 2025 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
తాజా ఎన్నికల్లో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని కామెంట్లతో ఓ వీడియోను పోస్టు చేస్తున్నారు. “Celebration at Congress HQ as they HAT- TRICK successful Zero win” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Celebration at Congress HQ as they maintain their previous result: Zero.
— Mr Sinha (@MrSinha_) February 8, 2025
🤣🤣🤣
pic.twitter.com/po72mXhi5z
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.
Celebration at Congress HQ as they maintain their previous result: Zero.
— Mr Sinha (@MrSinha_) February 8, 2025
🤣🤣🤣
pic.twitter.com/po72mXhi5z
Celebration at Congress HQ as they maintain their previous result: Zero.
— Yogendra Sharma (@sharmayogendr89) February 8, 2025
🤣🤣🤣#DelhiElections2025 #DelhiAssemblyElection2025 #Delhi #Kejriwal #Congress pic.twitter.com/d9KFMDudS4
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వాదన నెటిజన్లను తప్పుదోవ పట్టించింది.
వైరల్ వీడియోలలో ఒకదానిని తెలుగు పోస్ట్ తనిఖీ చేసినప్పుడు, MrSinha అనే X నెటిజన్ రాధికా ఖేరాకు వీడియో క్రెడిట్‌ని పంచుకున్నారు. రాధిక ఖేరా X ఖాతాలో వీడియో కోసం సెర్చ్ చేయగా, ఆమె ఈ వీడియోను ఈ జనవరి 24న “दिल्ली में 4.26% वोट वाली कांग्रेस का ‘भांगड़ा’ देख कर लगा, जैसे सियासी दफ्तर नहीं, ‘पागलखाने का वार्ड’ खुल गया हो! जिनकी राजनीति को जनता ने बार-बार नकारा, वो अब अपनी हार पर ही जश्न मनाने में मस्त हैं! कांग्रेस का नया नारा—‘हारो, नाचो, भूल जाओ!’” హిందీ క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు గుర్తించారు.
दिल्ली में 4.26% वोट वाली कांग्रेस का ‘भांगड़ा’ देख कर लगा, जैसे सियासी दफ्तर नहीं, ‘पागलखाने का वार्ड’ खुल गया हो!
— Radhika Khera (@Radhika_Khera) January 23, 2025
जिनकी राजनीति को जनता ने बार-बार नकारा,
वो अब अपनी हार पर ही जश्न मनाने में मस्त हैं!
कांग्रेस का नया नारा—‘हारो, नाचो, भूल जाओ!’ pic.twitter.com/BDjtWCJdLf
ఢిల్లీలో 4.26% ఓట్లు పొందిన కాంగ్రెస్ నేతలు 'భాంగ్రా'ను చేస్తుండగా.. అది పొలిటికల్ పార్టీ ఆఫీసు కాదు మానసిక వికలాంగుల ఆఫీసులా అనిపించింది. వీరిని ప్రజలు పదే పదే తిరస్కరించారు, ఇప్పుడు తమ ఓటమిని కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారని అర్థం వచ్చే వాదనతో పోస్టు పెట్టారు.
News 24 ఎక్స్ హ్యాండిల్ లో కూడా ఓ వీడియోను షేర్ చేశారు. నాయకులు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఢిల్లీ కాంగ్రెస్ థీమ్ సాంగ్‌ను లాంఛ్ చేశారు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. అభయ్ దూబే, రాగిణి నాయక్, పవన్ ఖేరాతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. “जीत हार से परे..कांग्रेस पार्टी ने ढोल नगाड़े के साथ दिल्ली विधानसभा चुनाव के लिए अपने "थीम सॉन्ग" को लॉन्च किया..पार्टी के वरिष्ठ नेताओं ने भी थीम सॉन्ग पर थिडक कर कार्यकर्ताओं का उत्साह बढ़ाया..” అనే శీర్షికలతో జనవరి 23, 2025న ఈ వీడియో షేర్ చేశారు.
दिल्ली कांग्रेस का थीम सांग लांच होने पर नाचे कई कांग्रेस नेता
— News24 (@news24tvchannel) January 23, 2025
◆ रागिनी नायक. अभय दुबे और पवन खेड़ा समेत झमकर थिरके कई नेता @NayakRagini | @Pawankhera | @AbhayDubeyINC pic.twitter.com/bc6kWmnf4e
విజయం, ఓటమికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల కోసం తన "థీమ్ సాంగ్" రిలీజ్ చేసింది. పార్టీ నాయకులు థీమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతలు డ్యాన్స్ చేస్తున్నారనే వాదన ప్రజల్ని తప్పుదోవ పట్టించేది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తన థీమ్ సాంగ్‌ను లాంఛ్ చేసినప్పుడు జనవరి 23, 2025న చిత్రీకరించారు.
Claim : 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటునన్నారు
Fact: కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఎన్నికల కోసం థీమ్ సాంగ్ రిలీజ్ చేసిన సమయంలో డ్యాన్స్ చేసిన వీడియో అది. కానీ ఓటమి తరువాత డ్యాన్స్ చేశారని ప్రచారం చేశారు.
This story was originally published by Telugu Post as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.
Follow Fact Check News on ABP DESAM for more latest stories and trending topics.