అన్వేషించండి

TVK Vijay: తమిళనాట స్టాలిన్‌కు చెక్ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ - విజయ్‌కు సక్సెస్ ఫార్ములా ఇచ్చేసినట్లే !

Prashant Kishore: తమిళనాట విజయ్ కు తొలి ప్రయత్నంలో విజయం అందించేందుకు ప్రశాంత్ కిషోర్ రంగంలోకి వచ్చారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే విజయం ఖాయమని రిపోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Prashant Kishore seems to have finalized Vijay alliance with AIADMK: తమిళనాడు లో 2026లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. స్టాలిన్ సు ధీటైన నాయకుడు లేడని ప్రచారం జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ విజయం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీవీకే పార్టీని ప్రారభించి.. డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడుతుతున్నారు. తాజాగా ఆయన ప్రశాంత్ కిషోర్ తో కలిసి స్ట్రాటజీలపై చర్చించారు.  ప్రశాంత్ కిషోర్ - విజయ్ భేటీ  రాజకీయంగా తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. 

గత ఎన్నికల్లో డీఎంకేకు పని చేసిన ప్రశాంత్ కిషోర్ 

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో  స్టాలిన్ డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ పని చేశారు. అయితే ఆ తర్వాత ఆయన స్ట్రాటజిక్  పనులకు దూరంగా ఉన్నారు. బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయం  చేసుకుంటున్నారు. అయితే తనను సంప్రదించే రాజకీయ నేతలకు సలహాలు మాత్రం ఇస్తున్నారు. డీఎంకే పార్టీ ప్రశాంత్ కిషోర్ తో తర్వాత సంబంధాలు కొనసాగించలేదు. దీంతో పీకే ఆ పార్టీకి దూరమయ్యారు. గత ఎన్నికల సమయంలో సునీల్ కనుగోలు అన్నాడీఎంకే కు పని చేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రధాన వ్యూహకర్తగా మారారు. 

టీవీకే, అన్నాడీఎంకే మధ్య పొత్తును ప్రతిపాదించిన ప్రశాంత్ కిషోర్

తమిళనాడు మీడియా వెల్లడిస్తున్న సమాచారం మేరకు.. ప్రశాంత్ కిషోర్..  విజయ్ పార్టీ, అన్నాడీఎంకే పార్టీ మధ్య పొత్తును ప్రతిపాదించారు. రెండు పార్టీలు కలిస్తే తప్ప డీఎంకేఓడించడం అసాధ్యమని చెప్పినట్లుగా తెలుస్తోంది. పైగా విడివిడిగా పోటీ చేస్తే డీఎంకేకు భారీ మెజారటీలు వస్తాయని విశ్లేషించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ అన్నాడీఎంకే నాయకత్వంతోనూ చర్చించినట్లుగా చెబుతున్నారు. పట్టు విడుపులకు పోకుండా రెండు పార్టీలు కలిస్తే రాజకీయం హోరాహోరీగా మారుతుందన్న అంచనాలను వేస్తున్నారు. 

అన్నాడీఎంకే రెడీ - మరి విజయ్ ఆలోచన ఏమిటో ?

విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత అన్నాడీఎంకేను పల్లెత్తు మాట అనలేదు. పూర్తిగా డీఎంకేనే టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో  అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో విజయ్ వ్యూహాత్మకంగానే ఉన్నారని అంటున్నారు. జయలలిత అభిమానులంతా ఏకపక్షంగా తన వైపే ఉంటే.. విజయం సునాయసం అవుతుందని  విజయ్ భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. తమిళనాడు రాజకీయంలో వేడి పెరిగే అవకాశం ఉంది.                 

విజయ్ రాజకీయాల్లోకి రావడంతో స్టాలిన్ తన వారసుడిగా తన కుమారుడు ఉదయనిధిని ప్రకటించారు. ఎన్నికల వంటి  కీలక విషయాల్లో ఉదయనిధి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పై పూర్తి పట్టు సాధించారు. స్టాలిన్ .. విజయ్ కు పోటీగా రాజకీయం చేయరని .. తన కుమారుడ్ని తెర ముందు ఉంచారని చెబుతున్నారు.  దీంతో వచ్చే ఎన్నికల్లో విజయ్ వర్సెస్ ఉదయనిది అన్నట్లుగా ఎన్నికలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. 

Also Read: అల్లు అర్జున్ అరెస్టుపై కేరళలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు, సెలబ్రిటీలకు కీలక సూచనలు

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget