News
News
X

Rakesh Jhunjhunwala: 10 నిమిషాల్లో రూ.318 కోట్లు నష్టపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా!

ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా శుక్రవారం రోజు కేవలం పది నిమిషాల్లోనే రూ.318 కోట్లు నష్టపోయారు. ఒకే కంపెనీ స్టాక్‌ పతనం అవ్వడంతోనే ఆయనకు అంత నష్టం వాటిల్లింది.

FOLLOW US: 

స్టాక్‌ మార్కెట్లో నిమిషాల్లోనే కోట్ల లాభం వస్తుంది. మరు నిమిషంలోనే ఆ లాభమంతా ఆవిరి అవుతుంటుంది! ఇన్వెస్టర్లు ఇలాంటి ఆటుపోట్లను సులభంగా తట్టుకోగలరు. సుదీర్ఘ కాలం వారు పెట్టుబడులను కొనసాగిస్తుండటమే ఇందుకు కారణం. డే ట్రేడర్లు మాత్రం అలాంటి నష్టాలను భరించడం చాలా కష్టం. అందుకు ఇదే ఉదాహరణ.

ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా శుక్రవారం రోజు కేవలం పది నిమిషాల్లోనే రూ.318 కోట్లు నష్టపోయారు. ఒకే కంపెనీ స్టాక్‌ పతనం అవ్వడంతోనే ఆయనకు అంత నష్టం వాటిల్లింది. రాకేశ్‌ పోర్టుఫోలియోలో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ టైటాన్‌ మాత్రమే ఆయనను ఎక్కువ సంపన్నుడిగా మార్చింది. శుక్రవారం అదే స్టాక్‌ ఆయనకు స్వల్ప నష్టం మిగిల్చింది.

టైటాన్‌ కంపెనీ షేరు శుక్రవారం ఉదయం రూ.2,336 వద్ద ఆరంభమైంది. కొద్ది క్షణాల్లోనే అంటే ఉదయం 9:25 వద్ద రూ.2,283ను తాకింది. షేరుకు రూ.73 వరకు నష్టపోయింది. ఇందులో రాకేశ్‌కు 3,37,60,395 షేర్లు ఉన్నాయి. ఆయన సతీమణి రేఖకు 95,40,575 షేర్లు ఉన్నాయి. మొత్తంగా వీరిద్దరికీ కలిపి  4,33,00,970 కోట్ల షేర్లు ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.73 నష్టాన్ని లెక్కిస్తే ఆయన సంపద రూ.318 కోట్ల మేర తగ్గిపోయింది.

రాకేశ్‌ భారీ ఇన్వెస్టర్‌ అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన సుదీర్ఘ కాలం పెట్టుబడులను అలాగే కొనసాగిస్తారు. టైటాన్‌ స్టాక్‌ మళ్లీ రూ.2,336ను చేరుకోవడం ఖాయం. అంతకు మించీ లాభపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘ కాల ఇన్వెస్టర్లకు తాత్కాలిక నష్టాలు ఇబ్బందేమీ కలిగించవు.

Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!

Also Read: Worlds First Text Message: ప్రపంచంలోనే మొట్టమొదటి SMSను వేలం వేస్తున్న వొడాఫోన్‌.. ఆ సందేశంలో ఏముందో తెలుసా?

Also Read: Digital Payments in 2021: క్రెడిట్‌ కార్డు యూజర్లు కేక! డిజిటల్‌ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..

Also Read: Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్‌ ఎకానమిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Dec 2021 07:20 PM (IST) Tags: Rakesh Jhunjhunwala stock Titan Tata stock

సంబంధిత కథనాలు

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Tax Regime in India: టాక్స్‌ పేయర్స్‌ అలర్ట్‌! మినహాయింపుల్లేని పన్ను వ్యవస్థకు మోదీ సర్కార్‌ కసరత్తు!

Tax Regime in India: టాక్స్‌ పేయర్స్‌ అలర్ట్‌! మినహాయింపుల్లేని పన్ను వ్యవస్థకు మోదీ సర్కార్‌ కసరత్తు!

Rakesh Jhunjhunwala Dance: మరణం ముందు ఖజురారే పాటకు ఝున్‌ఝున్‌వాలా డాన్స్‌! కన్నీరు పెట్టిస్తున్న వీడియో!!

Rakesh Jhunjhunwala Dance:  మరణం ముందు ఖజురారే పాటకు ఝున్‌ఝున్‌వాలా డాన్స్‌! కన్నీరు పెట్టిస్తున్న వీడియో!!

Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిల్‌ ధర ఎంతంటే?

Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిల్‌ ధర ఎంతంటే?

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ 'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ  'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!