Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్ ఎకానమిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
క్రిప్టోలు ప్రమాకరంగా పరిణమించలేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అన్నారు. క్రిప్టోలపై అంతర్జాతీయంగా ఒక విధానం రూపొందించుకోవాలని వెల్లడించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో కరెన్సీని నిషేధించడం కన్నా నియంత్రిస్తే మంచిదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అన్నారు. ఇప్పటికైతే క్రిప్టోలు ప్రమాకరంగా పరిణమించలేదని పేర్కొన్నారు. క్రిప్టోలపై అంతర్జాతీయంగా ఒక విధానం రూపొందించుకోవాలని వెల్లడించారు. అప్లైడ్ ఎకనామిక్స్ జాతీయ మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
'క్రిప్టో కరెన్సీలను నిషేధించడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే ఎక్స్‌ఛేంజ్‌లన్నీ విదేశాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు అవి మన నియంత్రణ పరిధిలోకి రావు' అని గీత అన్నారు. డిజిటల్ కరెన్సీలపై అంతర్జాతీయంగా ఒక విధానం రావాలని ఆమె పేర్కొన్నారు. ఏ ఒక్క దేశమూ తనకు తానుగా ఈ సమస్యను పరిష్కరించుకోలేదని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను విదేశాల్లో చేసేందుకు ఆస్కారం ఉండటమే ఇందుకు కారణం అన్నారు. 'అత్యవసరంగా క్రిప్టో కరెన్సీపై అంతర్జాతీయ విధానం రూపొందించుకోవాలి' అని ఆమె సూచించారు. ఇప్పటికైతే ఇవి అంతర్జాతీయ ముప్పుగా పరిణమించలేదని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై గీతా గోపీనాథ్ స్పందించారు. 'అత్యధిక సంక్రమణ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే నెలల్లో ఒమిక్రాన్ ఆధిపత్యం పెరగొచ్చు. వేగంగా అందరికీ సోకే గుణం ఉండటం ప్రమాదకరం. ప్రపంచమంతా వ్యాక్సినేషన్ జరగడం ఆవశ్యకం. లేదంటే కొవిడ్-19లో కొత్త వేరియెంట్లు మళ్లీ మళ్లీ వస్తుంటాయి' అని ఆమె తెలిపారు.
ప్రస్తుతం క్రిప్టో కరెన్సీపై భారత్‌లో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. శీతకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడుతుండటమే ఇందుకు కారణం. మొదట్లో క్రిప్టోనూ పూర్తిగా నిషేధిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్రిప్టోను అసెట్ క్లాస్ కింద పరిగణించి నియంత్రణలోకి తీసుకొస్తారని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం
Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!
Also Read: Gold-Silver Price: శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర, వెండి స్వల్పంగా.. ఇవాల్టి ధరలు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి