Digital Payment Incentive: ఈ డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్ ఆమోదం!
డిజిటల్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కేబినెట్ ఆమోదించిన నిర్ణయాలను మంత్రులు వెల్లడించారు.
![Digital Payment Incentive: ఈ డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్ ఆమోదం! Cabinet Approves Incentive Scheme for Digital Payments, Scheme For Farmers Key Announcements Digital Payment Incentive: ఈ డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్ ఆమోదం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/f4720128d2e2f2b2809566ed32b1668f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కేంద్ర కేబినెట్ బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. డిజిటల్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కేబినెట్ ఆమోదించిన నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
'రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1300 కోట్లను ఖర్చు చేయనున్నాం' అని మంత్రి అనురాగ్ తెలిపారు. రైతుల కోసం 2021-2026 మధ్య కాలానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 22 లక్షల రైతులకు ప్రయోజనం కలగనుందని వ్యవసాయ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. దేశంలోని వనరులను మెరుగ్గా ఉపయోగించుకొని ఉత్పత్తిని పెంచడమే దీని ముఖ్యోద్దేశమని వెల్లడించారు.
సెమీ కండక్టర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలోనే చిప్‌ల తయారీ చేపట్టేందుకు అనువైన వాతావరణం కల్పించనుంది. ఇందుకోసం ఆరేళ్లకు గాను రూ.76,000 కోట్లను ఖర్చు చేయనుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో భాగంగా దీనిని చేపట్టనుంది.
'ఈ రోజు మనం 75 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీకి చేరుకున్నాం. ఈ వేగంతో రాబోయే ఆరేళ్లలో భారత్ 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీకి చేరుకోనుంది. ప్రపంచంలోని సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న ఇంజినీర్లలో 20 శాతం మంది భారతీయులే. అందుకే 85వేల మంది క్వాలిఫైడ్ ఇంజినీర్ల కోసం చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్‌ను రూపొందించేందుకు కేబినెట్ నిర్ణయించింది' అని ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!
Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)