IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Petrol-Diesel Price, 15 December: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రో, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల.. నేటి ధరలు ఎంతంటే..

హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి.

FOLLOW US: 

కొద్ది రోజుల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే నేడు ఇంధన ధరలు అన్ని చోట్లా స్థిరంగా ఉన్నాయి.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 15)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.95.68 గానే కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.53 పైసలు తగ్గి రూ.109.93 గా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.0.49 పైసలు తగ్గి రూ.96.23 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.3గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.65 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.41గా ఉంది. ఇది రూ.0.60 పైసలు తగ్గింది.

ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.07 పైసలు తగ్గి రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు తగ్గి రూ.96.36గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

తిరుపతిలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.29 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.96.60 గానే కొనసాగుతోంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 15 నాటి ధరల ప్రకారం 70.07 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 15 Dec 2021 07:13 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: వరుసగా రెండో వీకెండ్‌ లాభాలే లాభాలు! సెన్సెక్స్‌ 632+, నిఫ్టీ 182+

Stock Market News: వరుసగా రెండో వీకెండ్‌ లాభాలే లాభాలు! సెన్సెక్స్‌ 632+, నిఫ్టీ 182+

Radhakishan Damani: స్టాక్‌ మార్కెట్‌ పతనం - డీమార్ట్‌ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!

Radhakishan Damani: స్టాక్‌ మార్కెట్‌ పతనం - డీమార్ట్‌ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌ కాస్త నయం! ఎథీరియమ్‌ అల్ల కల్లోలం!

Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌ కాస్త నయం! ఎథీరియమ్‌ అల్ల కల్లోలం!

టాప్ స్టోరీస్

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ -  టీడీపీ నిర్ణయం !

F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

F3 Movie Review  - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, ఆ వెంటనే గతం మరిచిపోయిన భర్త, ఇలా మీకూ జరగొచ్చట!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, ఆ వెంటనే గతం మరిచిపోయిన భర్త, ఇలా మీకూ జరగొచ్చట!