Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam
జనరల్ గా స్కూల్ యానివర్సీ అంటే ఎవరో ఒక సెలబ్రెటీని పిలిస్తే గొప్ప అనుకుంటాం. అలాంటిది ఈ స్కూల్ చూడండి మొత్తం అంతా సెలబ్రెటీలే వాళ్ల పిల్లల్ని తీసుకుని స్కూల్ కి వచ్చారు. ఇంత మంది సెలబ్రెటీలు తమ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారంటే ఈ స్కూల్ ఎంత పెద్ద వాళ్లదై ఉండాలి. ఎస్ ఈ స్కూల్ అంబానీల ఫ్యామిలీకి చెందింది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇవి. మొత్తం రెండు రోజులు చేశారు. రకరకాల ఈవెంట్స్ పిల్లల కోసం కండక్ట్ చేశారు. ఎంత స్టార్లైనా కూడా తమ పిల్లలకు తల్లితండ్రులే కదా అందుకే ఇలా తమ పిల్లల కోసం అంబానీ స్కూల్ కి వచ్చారు సెలబ్రెటీలంతా. అభిషేక్, ఐశ్వర్య తమ పాప ఆరాధ్య కోసం వచ్చారు. మనవరాలి కోసం బిగ్ బీ అమితాబ్ కూడా వచ్చి సందడి చేశారు. తమ కుమారుడు అబ్రహం కోసం షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ వచ్చి సందడి చేశారు. ఇంకా రితేశ్, జెనీలియా, హర్భజన్ సింగ్, గీతా బస్రా, హేమామాలినీ, విద్యాబాలన్ ఇలా ఒకరా ఇద్దరా సెలబ్రెటీల జాతర కనిపించింది. మరి ఇంతమంది సెలబ్రెటీల పిల్లల్ని చదివిస్తున్న పెద్ద సెలబ్రెటీ కూడా రావాలిగా. ఎస్ ముఖేష్ అంబానీ, ఆయన కుమార్తె ఈషా అంబానీ, చిన్న కోడలు రాధికా అంబానీ కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు.





















