అన్వేషించండి

Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !

US: అదాని గ్రూపు లంచాలు ఇచ్చిందని అమెరికాలో నమోదైన కేసులోకీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు పెట్టిన అటార్నీ రాజీనామా చేశారు. జనవరి 10 ఆయన లాస్ట్ వర్కింగ్ డే.

Attorney Behind US Department Move Against Adani Group To Resign: అమెరికాతో పాటు భారత్ లోనూ సంచలనం సృష్టించిన అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఆరోపణల విషయంలో కీలకంగా ఉన్న  అటార్నీ బ్రీన్ పీస్  తన పదవికి రాజీనామాను ప్రకటించారు. జనవరి పదో తేదీన ఆయన లాస్ట్ వర్కింగ్ డే.  50 ఏళ్ల పీస్‌ను 2021లో అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు.   జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కంటే పది రోజుల ముందే అటార్నీ పదవి నుంచి వైదొలగనున్నారు.  ప్రస్తుతం అమెరికా అసిస్టెంట్ అటార్నీగా ఉన్న కరోలిన్ పోకోర్నీ ... బ్రీన్ పీస్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇండియాలోని విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో అధిక ధరలు నిర్ణయించడానికి అదానీ లంచాలు ఇచ్చారని .. ఆ విషయాన్ని దాటి పెట్టి  యుఎస్ పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ,  సంస్థకు చెందిన ఇతర అధికారులపై నవంబర్లో  కేసులు నమోదు చేయడంలో బ్రీన్ పీస్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ అభియోగాలను అదానీ గ్రూపు తిరస్కరించింది. లంచాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 

Also Read: పెళ్లయిన 43 ఏళ్లకు రూ.3 కోట్లు భరణం ఇచ్చి మరీ భార్యకు విడాకులు - పాపం ఈ పెద్దాయన ఎంత టార్చర్ అనుభవించారో ?

అమెరికా అటార్నీ చేసిన తప్పుడు చర్య వల్ల  అంతర్జాతీయ ప్రాజెక్టుల రద్దు, ఆర్థిక మార్కెట్ పై ప్రబావం పడిందని అదానీ గ్రూపు  అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  అమెరికా ప్రభుత్వ నివేదిక అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందంతో ముడిపడి ఉందని అ ఇది అనుబంధ వ్యాపారంలో సుమారు 10 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది. అదానీ గ్రూప్ కు చెందిన 11 ప్రభుత్వ కంపెనీల్లో ఏ ఒక్కదానిలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్  కేసులు నమోదయినప్పుడే ప్రకటించారు. 

Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !

అదానిపై అమెరికాలో నమోదైన కేసు ఇండియాలో రాజకీయగానూ సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏపీలోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి ఏపీ సీఎంకు రూ. 1750 కోట్లు లంచాన్ని అదానీ ఇచ్చారని యూఎస్ అటార్నీ ఆరోపణుల చేశారు. దీంతో ఏపీలో జగన్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అది ప్రైవేటు కంపెనీల వ్యవహారమని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ స్పందించారు. తమ దేశ చట్టాల ప్రకారమే కేసు నమోదయిందని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాలో మారనున్న సమయంలో .. కీలక స్థానాల్లో ఉన్న వారు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటార్నీ కూడా మారిపోయారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget