Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Andhra News: గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.
Pawan Kalyan Visited Manyam District: గత వైసీపీ హయాంలో రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు కానీ.. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రోడ్లు మాత్రం వేయలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా (Manyam District) సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 'కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు రూ.38.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతోంది. తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నాను. 2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశాను. తాగునీరు, రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నాం. సుందర జలపాతాలున్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు.
'3 దశల్లో రోడ్ల అభివృద్ధి'
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 3 దశల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గంలో బాగుజోల – సిరివర రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో ఆయన మాట్లాడారు. 'దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైనా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం పట్టిపీడుస్తున్నాయి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 2 నెలలకు ఓసారి కచ్చితంగా పర్యటించి సమస్యలు తెలుసుకుంటాను.' అని పవన్ స్పష్టం చేశారు.
గిరిజనులతో మాటామంతీ..