Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Virat Kohli News: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ న్యూ లుక్ కేక పుట్టిస్తోంది. తాజాగా ఈ లుక్‌కు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, క్షణాల్లో వైరలైంది.

Ind Vs Aus Test Series: ఈనెల 26 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్తగా సన్నద్ధమవుతున్నాడు. బ్యాట్‌తో రెగ్యులర్‌గా కఠోర సాధన చేస్తున్న ఈ మాజీ కెప్టెన్.. తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగా, నిమిషాల్లో వైరలైంది. ఇందులో కోహ్లీ.. తన హెయిర్ స్టైల్‌ను కొద్దిగా మార్చుకున్నాడు. కోహ్లీ జుట్టును హెయిర్ స్టైలిస్టు.. కాస్త చిన్నగా కట్ చేసుకోవడంతో పాటు, సైడ్ వైపు చిన్నగా ట్రిమ్మింగ్ చేశాడు. ఈ తతంగాన్ని అంతా స్వయంగా కోహ్లీ వీడియోలో చూపించడం విశేషం. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
రెండు టెస్టులపై నజర్..
ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. తొలి టెస్టును భారత్ 295 పరుగులతో దక్కించుకోగా, రెండో టెస్టును ఆసీస్ పది వికెట్లతో సొంతం చేసుకుంది. ఇక మూడో టెస్టు వరణుడి అడ్డంకి వల్ల డ్రాగా ముగిసింది. నిజానికి ఈ టెస్టులో ఎక్కువ భాగం ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించినా వర్షం వల్ల మొత్తానికి భారత్ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఇక ఈ సిరీస్‌లో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ, ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా కోహ్లీ ఆఫ్ స్టంప్ బలహీనతను బౌలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో కోహ్లీ ఈ విషయంపై ప్రత్యేకంగా నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాబోయే రెండు టెస్టులో రాణించాలని గట్టి పట్టుదలతో కోహ్లీ ఉన్నాడు.
వార్తల్లో కోహ్లీ..
ఇక ఆటకు సంబంధించినదే కాకుండా పలు విషయాల్లో కోహ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. గురువారం మెల్ బోర్న్ ఎయిర్‌పోర్టులో ఆసీస్ మీడియాతో కోహ్లీ గొడవ పడిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని అనుమతి లేకుండా ఫొటోలు తీస్తున్నారనే ఆగ్రహంతో కోహ్లీ మాటల యుద్ధానికి దిగాడు. ఆ తర్వాత టీ కప్పులో తుఫానులాగా ఈ వివాదం చల్లారి పోయింది. అంతలోనే కోహ్లీ త్వరలోనే విదేశాల్లో స్థిర పడనున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. స్వయంగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఈ విషయాన్ని కన్ఫాం చేయడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. అయితే ఇంత జరుగుతున్నా, కోహ్లీ మాత్రం తన ఆటపైనే నజర్ పెట్టాడు. మరింత ఫోకస్‌గా ప్రాక్టీస్ చేసి, రాబోయే టెస్టుల్లో సత్తా చాటి విమర్శకులకు తన బ్యాట్ తో సమాధానం చెప్పాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

