Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam
ఈ వీడియో ఎన్నికల ముందు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల పల్లెల్లో తిరిగినప్పటిది. ఓ మహిళ పవన్ కళ్యాణ్ మాత్రమే తొలిసారి తమ గ్రామానికి వచ్చాడని ఎన్నో సమస్యలున్న తమ పల్లెలు బాగుపడేలా ఇతను చేస్తాడని చాలా నమ్మకంతో చెప్పింది ఆ పెద్దావిడ. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చారు. గిరిజన గ్రామాల్లో డోలీ కష్టాలు తీరేలా పార్వతీపురం మన్యం జిల్లాలో 36కోట్ల 71 లక్షల రూపాయల వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణానికి శంకుస్థపానలు చేశారు. బాగుజోల నుంచి
చిలకల మండంగి వైపు కొండపైకి కాళ్లకు చెప్పులేకుండా నడుచుకుంటూ వెళ్లారు.
ఈ రోడ్ల నిర్మాణంతో గిరిజన గ్రామాల్లో తీరనున్న డోలీ మోత కష్టాలు తప్పనున్నాయి ఆ పెద్దావిడ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టారని...ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఆ పెద్దావిడ వీడియోను సామాజిక మాధ్యమాల ల్లో పోస్ట్ చేసింది