By: ABP Desam | Updated at : 15 Dec 2021 06:03 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
జియో అత్యంత చవకైన రూ.1 రీచార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.
జియో సైలెంట్‌గా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్ ఇదే. రూ.1 విలువైన ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉండనుంది. డేటా అవసరం అయినప్పుడు మాత్రమే కొనుగోలు చేసేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ మై జియో యాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. జియో తన రూ.119 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను కూడా సవరించింది.
ఈ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా 100 ఎంబీ డేటా లభించనుంది. ఆ డేటా పూర్తయితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వాల్యూ సెక్షన్‌లో చూడవచ్చు. జియో 1 జీబీ డేటా ప్యాక్ విలువ రూ.15 రోజులుగా ఉంది. కానీ 100 ఎంబీ ప్యాక్‌తో పది సార్లు రీచార్జ్ చేస్తే 1 జీబీ డేటా లభించనుంది. అంటే 1 జీబీ డేటాను రూ.10కే పొందవచ్చన్న మాట.
ప్రస్తుతానికి జియో తప్ప మరే నెట్‌వర్క్ ప్రొవైడర్ రూ.1 కంటే తక్కువ ధరకు రీచార్జ్ ప్లాన్ అందించడం లేదు. పైన చెప్పినట్లు డేటా అవసరం అయినప్పుడు మాత్రమే రీచార్జ్ చేసుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడనుంది. అయితే ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఎన్నిసార్లు రీచార్జ్ చేసుకోవచ్చో తెలియరాలేదు.
ఈ నెల ప్రారంభంలో జియో సైలెంట్‌గా తన రూ.119 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా లభించనున్నాయి. గతంలో రూ.98 ప్లాన్ ద్వారా ఇవే లాభాలు అందించేవారు.
ధరతో పాటు వ్యాలిడిటీలో కూడా కొన్ని మార్పులు చేశారు. రూ.98 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ.119 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు మాత్రమే ఉంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Motorola Edge 30 Fusion: మనదేశంలో మోటొరోలా కొత్త ఫోన్ - లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంతో!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - చాట్ పక్కకు స్వైప్ చేస్తే!
Samsung Galaxy A04 Core: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - కీలక వివరాలు లీక్!
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
pTron Tangent Duo: రూ.500లోపే వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!
CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం
CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam
Live Train Status: రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!
BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!