Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే మోటో జీ51 5జీ.
మోటో జీ51 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో డిసెంబర్ 10వ తేదీన లాంచ్ కానుందని సమాచారం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఏకంగా 12 5జీ బ్యాండ్లు ఉండనున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు 120 హెర్ట్జ్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉండనుందని సమాచారం. 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
మోటో జీ51 5జీ ఇండియా లాంచ్ డేట్
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలుపుతున్న దాని ప్రకారం.. మోటో జీ51 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో డిసెంబర్ 10వ తేదీన లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ వివరాలను మోటొరోలా అధికారికంగా ప్రకటించలేదు.
మోటో జీ51 5జీ ధర(అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. మోటో జీ51 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999గా ఉండనుంది. దీంతో మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్‌గా ఈ ఫోన్ నిలవనుంది. గతేడాది నవంబర్‌లో మోటో జీ51 5జీ యూరోప్‌లో లాంచ్ అయింది.
మోటో జీ51 5జీ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ యూరోపియన్ వెర్షన్ ఫీచర్లే ఇందులో కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. మోటో జీ51 5జీ యూరోపియన్ వెర్షన్‌లో 6.8 అంగుళాల హోల్ పంచ్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై మోటో జీ51 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించారు. ఇందులో డ్యూయల్ వ్యూ రికార్డింగ్, మైక్రో మోషన్ ఫొటోగ్రఫీ, స్పాట్ కలర్ ఫొటోగ్రఫీ, మాక్రో ఫొటోగ్రఫీ, స్మైలింగ్ ఫేస్ క్యాప్చర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
డ్యూయల్ 5జీ సపోర్ట్‌ను కూడా ఇందులో మోటొరోలా అందించింది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!