అన్వేషించండి

HDD లేదా SDD లలో తేడా ఏంటి? మార్చడానికి ముందు ఇది తెలుసుకుంటే బెటర్

HDDలు పాత తరహా స్టోరేజ్ పరికరాలుగా ఉన్నాయి. కంప్యూటర్లలో చాలా కాలం నుంచి ఇవి వాడుకలో ఉన్నాయి. అయితే SSD స్టోరేజీ డివైజ్ ద్వారా పనితీరు వేగంగా ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • HDD పాత సాంకేతికత, మెకానికల్ భాగాలతో నెమ్మదిగా పనిచేస్తుంది.
  • SSD కొత్త సాంకేతికత, ఫ్లాష్ మెమరీతో చాలా వేగంగా పనిచేస్తుంది.
  • SSD మన్నికైనది, తక్కువ విద్యుత్ వినియోగంతో బ్యాటరీ జీవితాన్ని పెంచుతుంది.
  • వేగం కోసం SSD, ఎక్కువ నిల్వ కోసం HDD మంచి ఎంపిక.

HDD Vs SDD | ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల వేగాన్ని తెలుసుకుని మరీ ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ మీ సిస్టమ్ నెమ్మదిగా వర్క్ చేస్తుంటే, మొదట స్టోరేజీ మార్చాలని సలహా ఇస్తారు. అలాంటి పరిస్థితిలో, HDD, SSD మధ్య వ్యత్యాసం ఏంటి, ఏది మంచి ఛాయిస్  అని చాలా మందికి డౌట్ వస్తుంది. మీరు కూడా మీ పాత ల్యాప్‌టాప్ లేదా PC స్టోరేజీ మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రెండు టెక్నాలజీలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. 

HDD అంటే ఏమిటి?

హార్డ్ డిస్క్ డ్రైవ్ (Hard Disk Drive) అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, ఇది చాలా సంవత్సరాలుగా కంప్యూటర్‌లలో ఉపయోగిస్తున్న పాత స్టోరేజీ డివైజ్. ఇది లోపల తిరిగే డిస్క్, మెకానికల్ భాగాలను కలిగి ఉంటుంది. దీని సహాయంతో డేటాను స్టోర్ చేసి చదవవచ్చు.

HDD అతిపెద్ద ప్రత్యేకత దాని తక్కువ ధర అని తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ నిల్వ కావాలంటే, ఇది మంచి ఎంపికగా భావిస్తారు.  అందుకే పాత ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్‌లలో HDD ఎక్కువగా కనిపిస్తుంది.

SSD అంటే ఏమిటి.. దీనికి ఎందుకంత డిమాండ్ ?

సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది కొత్త టెక్నాలజీపై ఆధారపడిన నిల్వ పరికరం. ఇందులో తిరిగే డిస్క్ ఉండదు. కానీ ఫ్లాష్ మెమరీ చిప్‌లలో డేటా సేవ్ అవుతుంది. ఆ కారణంగా SSD వేగం HDD కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ త్వరగా ఆన్ అవవడంతో పాటు APPs వేగంగా తెరుచుకుంటాయి. ఫైల్ ట్రాన్స్‌ఫర్ చాలా వేగంగా జరుగుతుంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ చేసే వ్యక్తులు ఈ రోజుల్లో SSDని ఎక్కువగా లైక్ చేస్తారు. 

Also Read: Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..

HDD, SSD మధ్య వ్యత్యాసం

ఈ 2 స్టోరేజీ పరికరాలు డేటాను సేవ్ చేయడానికి పని చేస్తాయి. కాని పని చేసే విధానం భిన్నంగా ఉంటుంది. HDD యాంత్రిక వ్యవస్థపై ఆధారపడి ఉండగా, SSD ఎలక్ట్రానిక్ చిప్‌ల ద్వారా వర్క్ చేస్తుంది. వేగం విషయానికి వస్తే, SSD చాలా వేగంగా పనిచేస్తుంది. HDD రీడ్-రైట్ వేగం తక్కువగా ఉండటం వల్ల సిస్టమ్ కొన్నిసార్లు స్లో అనిపిస్తుంది. దీంతో పాటు, SSD తక్కువ పవర్ వినియోగిస్తుంది. దీనివల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

ఏది ఎక్కువ మన్నిక

HDDలో కదిలే భాగాలు ఉంటాయి కనుక పడిపోవడం లేదా షాక్ తగలడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. మరోవైపు, SSDలో ఎలాంటి యాంత్రిక భాగం ఉండదు. ఇది మరింత సురక్షితమైనది, మన్నికైనది. అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు భారీ డేటాను రాయడం వలన SSD లైఫ్ టైం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. కాని ఇది చాలా సంవత్సరాలు నడుస్తుంది.

స్టోరేజీ మార్చే ముందు ఏం గుర్తుంచుకోవాలి?

మీ ల్యాప్‌టాప్ చాలా నెమ్మదిగా ఉంటే SSDకి అప్‌గ్రేడ్ చేయాలి. కానీ మార్చే ముందు, మీ సిస్టమ్ SATA SSD లేదా NVMe SSDకి సపోర్ట్ ఇస్తుందో లేదో చెక్ చేయండి. దీనితో పాటు, బడ్జెట్, అవసరాన్ని కూడా గుర్తుంచుకోండి. తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజీ కావాలంటే, HDD సరైనది. కాని వేగవంతమైన పనితీరు కోసం SSD మంచి ఎంపిక. 

మీరు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ మాత్రమే స్టోర్ చేయాలనుకుంటే, HDD మీకు సరిపోతుంది. మీకు వేగం, సాఫ్ట్ వర్కింగ్, మంచి అనుభవం కావాలంటే, SSD తీసుకోవాలి. చాలా కొత్త ల్యాప్‌టాప్‌లు SSDతో వస్తున్నాయి, ఇది సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

 

Frequently Asked Questions

HDD అంటే ఏమిటి?

HDD (హార్డ్ డిస్క్ డ్రైవ్) అనేది కంప్యూటర్లలో ఉపయోగించే పాత స్టోరేజ్ పరికరం. ఇది లోపల తిరిగే డిస్క్ మరియు మెకానికల్ భాగాలను కలిగి ఉంటుంది, డేటాను నిల్వ చేయడానికి మరియు చదవడానికి ఉపయోగపడుతుంది.

SSD అంటే ఏమిటి?

SSD (సాలిడ్ స్టేట్ డ్రైవ్) అనేది కొత్త టెక్నాలజీపై ఆధారపడిన స్టోరేజ్ పరికరం. ఇందులో తిరిగే డిస్క్ ఉండదు, కానీ ఫ్లాష్ మెమరీ చిప్స్‌లో డేటా సేవ్ అవుతుంది, ఇది HDD కంటే చాలా వేగంగా పనిచేస్తుంది.

HDD మరియు SSD మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి?

HDD యాంత్రిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది, అయితే SSD ఎలక్ట్రానిక్ చిప్స్ ద్వారా పనిచేస్తుంది. SSD వేగం, పవర్ వినియోగం మరియు మన్నికలో HDD కంటే మెరుగ్గా ఉంటుంది.

ల్యాప్‌టాప్ స్టోరేజీని మార్చే ముందు ఏమి గుర్తుంచుకోవాలి?

మీ సిస్టమ్ SATA SSD లేదా NVMe SSDకి మద్దతు ఇస్తుందో లేదో తనిఖీ చేయండి. మీ బడ్జెట్ మరియు అవసరాలను బట్టి HDD (ఎక్కువ స్టోరేజ్) లేదా SSD (వేగవంతమైన పనితీరు) ఎంచుకోండి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget