అన్వేషించండి

OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!

OpenAI AI Smartphone: OpenAI కొత్త ఫోన్ మీద వర్క్ చేస్తోంది. ఈ కొత్త మొబైల్ యాప్‌లు లేకుండా AI ఏజెంట్స్‌తో మీ అవసరాలు తీర్చుతుంది. దాంతో మీరు ఏ యాప్స్ లేకుండా ఫోన్‌ను వినియోగించవచ్చు.

OpenAI AI Agent Smartphone | ప్రస్తుతం చాలా రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ ద్వారా కొందరి జాబ్ తేలిక కాగా, కొన్ని రంగాల్లో జాబ్స్ పోతున్నాయి. మరికొన్ని సంవత్సరాలలో మొబైల్ యాప్‌ల అవసరం లేకుండా టెక్నాలజీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ChatGPTని తయారు చేసిన OpenAI సంస్థ భవిష్యత్తులో ఎలాంటి యాప్‌ల అవసరం లేకుండా కేవలం AI ఏజెంట్లతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం వర్క్ చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే మన మొబైల్ యూజర్స్ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చేస్తుంది. OpenAIతో పాటు యాపిల్ మాజీ డిజైన్ చీఫ్ Jony Ive కూడా ఈ ఫోన్‌ తేవడంలో పని చేస్తున్నారని సమాచారం. OpenAI ఈ ఫోన్ కోసం ఏం ప్లాన్ చేస్తోంది, యాప్‌లు లేకుండా ఇది ఎలా పని చేస్తుందో కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

స్మార్ట్‌ఫోన్ గురించి OpenAI ప్లానింగ్

Apple విశ్లేషకుడు, టిప్‌స్టర్ మింగ్-చి కువో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. OpenAI నుంచి AI ఏజెంట్ ఫోన్ వివిధ యాప్‌లను మార్చడానికి బదులుగా వినియోగదారుల పనిని ఒకేసారి చేయడంపై ఫోకస్ చేస్తుంది. అంటే, ప్రతి పని కోసం ప్రత్యేక యాప్‌ను ఓపెన్ చేసేందుకు బదులుగా మీరు ఏం చేయాలో ఈ ఫోన్ అర్థం చేసుకుని స్వయంగా ఆ పనిని పూర్తి చేస్తుంది. ఈ ఫోన్ ప్రాసెసర్ కోసం, OpenAI మీడియాటెక్, క్వాల్‌కామ్‌తో చర్చిస్తోంది. లక్స్‌షేర్‌ను తయారీ భాగస్వామిగా చేర్చుకోవచ్చు అని భావిస్తున్నారు. ముఖ్యంగా 2028 నుండి ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చేలా ఉత్పత్తి ప్రారంభం కావచ్చు.

ఏ యాప్‌లు లేకుండా ఫోన్ ఎలా పని చేస్తుంది?

ప్రస్తుతం ఫోన్‌లో మెస్సేజ్‌లు, పేమెంట్స్, ఓటీటీ, స్పోర్ట్స్ ఇలా ఒక్కో సర్వీస్ కోసం ఒక ప్రత్యేక యాప్ ఉంది. OpenAI దీన్ని మార్చనుంది. వినియోగదారులకు యాప్‌లు కాదు, ఫలితాలు అవసరమని కంపెనీ AI ఏజెంట్ల సహాయం తీసుకుంటోంది. ఇవి AIతో నడిచే స్మార్ట్ సిస్టమ్‌లు, ఇవి రియల్ టైమ్‌లో ఆయా సందర్భాన్ని అనుసరించి, కస్టమర్ ప్రవర్తన, అవసరాలను అర్థం చేసుకుని పని చేస్తాయి. ఈ విధంగా, ఈ ఫోన్ ఓ పర్సనల్ అసిస్టెంట్ పాత్రను కూడా పోషిస్తుంది.

AI కంపెనీ ఈ ఫోన్ తయారు చేయడానికి కారణాలు 

OpenAI చాట్‌బాట్‌తో గతంలో వార్తల్లోకి వచ్చింది. తాజాగా హార్డ్‌వేర్‌పై కూడా ఫోకస్ చేస్తోంది. ఫోన్ తయారు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది ఫోన్ సహాయంతో కంపెనీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉండటం. ఇది వినియోగదారులకు ఏ ఇబ్బంది లేని AI అనుభవాన్ని అందించింది. రెండవ కారణం.. ఫోన్ సహాయంతో కస్టమర్ పనులను రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు. అంటే ఆ వినియోగదారు ఎక్కడ ఉన్నాడు, ఫోన్ వినియోగ విధానం ఏమిటి.. ఫోన్‌లో అతని ప్రాధాన్యతలు ఏమిటి అని తెలిసిపోతుంది. AI ఏజెంట్ కోసం ఈ డేటా చాలా అవసరం. స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే పరికరాలలో ఒకటిగా మారాయి. అలాంటి పరిస్థితిలో కొత్త యాప్స్, టెక్నిక్ క్రియేట్ చేయడానికి బదులుగా ఒకేచోట వినియోగదారులకు అప్‌గ్రేడ్ ఎంపికను అందించాలని కంపెనీ భావిస్తోంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget