అన్వేషించండి

YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్‌ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!

YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది.

YouTube AI Feature: వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ఒక కీలక మార్పులు చేర్పులు చేసింది. ఒక పెద్ద అడుగు వేస్తూ తన లైక్‌నెస్ డిటెక్షన్ (Likeness Detection) టెక్నాలజీని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి కూడా అందుబాటులోకి తెచ్చింది. AI ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలను, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను గుర్తించడంతో పాటు సెలబ్రిటీల గుర్తింపును రక్షించడం దీని ప్రధాన ఉద్దేశ్యం అని సంస్థ తెలిపింది.

Likeness Detection టెక్నాలజీ అంటే ఏమిటి?
ఈ టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వీడియోలను స్కాన్ చేస్తుంది. ఎవరైనా వ్యక్తి ముఖాన్ని ఏదైనా పద్ధతిలో క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలను ఇది గుర్తిస్తుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సెలబ్రిటీ ముఖం, రూపాన్ని ఎవరైనా తప్పుగా ఉపయోగిస్తే, ఈ సిస్టమ్ దానిని గుర్తించి పట్టుకుంటుంది. ఇది యూట్యూబ్‌లో కాపీరైట్ కంటెంట్‌ను గుర్తించే పాత కంటెంట్ ఐడీ (Content ID) సిస్టమ్ లాంటిదని సంస్థ పేర్కొంది. వీటిలో వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు ఇది ముఖాలను, సెలబ్రిటీల గుర్తింపును పర్యవేక్షిస్తుంది.

ఈ ఫీచర్ ఎందుకంత అవసరం
టెక్నాలజీ దుర్వినియోగం అవుతున్న ఈ రోజుల్లో పలు ఫేక్ ప్రకటనలు, ఫేక్ స్కామ్‌లలో ప్రముఖుల ముఖాలను వాడుతున్నారు. వారి అనుమతి లేకుండా ఒకరి గుర్తింపును ఉపయోగించడం నేడు అతి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి కేసులకు అడ్డుకట్ట వేయడం, తద్వారా ఏ సెలబ్రిటీ ఫొటో, వీడియో తప్పుగా వాడకుండా చూడటమే ఈ కొత్త టెక్నాలజీ లక్ష్యమని తెలుస్తోంది.

దీని ద్వారా ఎవరికి ప్రయోజనం 
మొదట్లో ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో క్రియేటర్లతో టెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దీనిని భారీ స్థాయిలో పలు విభాగాలకు యూట్యూబ్ విస్తరిస్తోంది. ఇప్పుడు ఇందులో టాలెంట్ ఏజెన్సీలు, మేనేజ్‌మెంట్ కంపెనీలు, వారితో అనుబంధం ఉన్న సినీ ఆర్టిస్టులను చేర్చింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి సెలబ్రిటీకి సొంత యూట్యూబ్ ఛానెల్ ఉండాల్సిన అవసరం లేదు.

యూజర్లకు ఉండే ఆప్షన్లు ఏమిటి?
ఏదైనా వీడియోలో ఒకరి నకిలీ గుర్తింపు కనుగొంటే, సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. వాటి ప్రకారం నడుచుకుంటూ చర్యలు తీసుకుంటారు.

మొదటగా ఆ వీడియోను తొలగించాలని కోరడం.

ఈ తరువాత కాపీరైట్ క్లెయిమ్ చేయడం.

లేదా దానిపై చర్యలు తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. 

అయితే, యూట్యూబ్ ఒక విషయాన్ని యూజర్లకు స్పష్టం చేసింది. ప్రతి వీడియోను డిలీట్ చేయడం మాత్రం జరగదు.  ఎందుకంటే ప్లాట్‌ఫారమ్‌లో పేరడీ (Parody), వ్యంగ్య కంటెంట్ ప్రదర్శించేందుకు అనుమతి ఉందని గుర్తుంచుకోండి.

ఇంకా ఏం మార్పులు రాబోతున్నాయి

ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ కేవలం మీ విజువల్ (ముఖం)పై మాత్రమే వర్క్ చేస్తుంది. కానీ భవిష్యత్తులో ఇందులో ఆడియో సైతం ఎవరిదో గుర్తించే సామర్థ్యాన్ని కూడా యాడ్ చేయాలని భావిస్తున్నారు. యూట్యూబ్ ఇలాంటి భద్రతను చట్టంలో భాగంగా చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. AI ద్వారా ఒకరి వాయిస్, ఫొటో, వీడియో ద్వారా వారి గుర్తింపును తప్పుగా ఉపయోగించడాన్ని నియంత్రించే లక్ష్యంతో అమెరికాలో తీసుకొస్తున్న NO FAKES Act కు కంపెనీ మద్దతు తెలుపుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget