అన్వేషించండి

Youtube Down: అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు

అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో YouTube ఒక్కసారిగా డౌన్ అయింది. దాదాపు 3 లక్షల మంది DownDetectorలో యూట్యూబ్ డౌన్ అని రిపోర్ట్ చేశారు.

Is YouTube Down: అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఒక్కసారిగా డౌన్ అయింది. భారత్‌లోనూ కొందరు యూజర్లు యూట్యూబ్ డౌన్ అని రిపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ అవుటేజ్‌లపై నిఘా ఉంచే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, మెజారిటీ వినియోగదారులు యాప్ డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కంప్లైంట్ చేస్తున్నారు. సుమారు 16 శాతం మంది యూజర్లు  వీడియో స్ట్రీమింగ్ డౌన్ అయిందని, 10 శాతం మంది వెబ్‌సైట్‌లో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై దాదాపు 3 లక్షల మందికి పైగా యూట్యూబ్ సర్వీస్ డౌన్ అయినట్లు రిపోర్ట్ చేశారు. 

డౌన్ కావడానికి కారణం వెల్లడి కాలేదు

యూట్యూబ్ సర్వీస్ డౌన్ కావడానికి గల కారణం ఏంటన్నది ఇప్పటివరకు వెల్లడి కాలేదు. అయితే నెటిజన్లు, వినియోగదారులు కంపెనీ నుండి అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బుధవారం ఉదయం అమెరికాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), ఇతర దేశాల్లో Youtube అవుటేజ్ ప్రభావం పడిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  సోషల్ మీడియాలో లక్షలాది మంది నిరంతరం దీనిపై కంప్లైంట్ చేస్తున్నారు. భారత్‌లో కూడా కొన్నిచోట్ల యూట్యూబ్ డౌన్ అయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. యూట్యూబ్‌తో పాటు గూగుల్, AWS, క్లౌడ్‌ఫ్లేయర్ కూడా డౌన్ అయ్యాయని చాలా మంది వినియోగదారులు చెబుతున్నారు.

సర్వీస్ డౌన్ అయినట్లు అంగీకరించిన యూట్యూబ్

తమ సర్వీస్ డౌన్ అయిన విషయాన్ని YouTube అంగీకరించింది. ఒక ప్రకటనలో, ‘సర్వీస్ డౌన్ అయినట్లు గుర్తించాం. ఈ సమస్యను పరిశీలిస్తున్నామం. ప్రస్తుతం మా వద్ద ఎలాంటి పరిష్కారం లేదు. అసలేం జరిగిందో పరిశీలిస్తున్నాం. మేం దీనిపై ఫోకస్ చేశాం. మా యూజర్లకు దీనిపై అప్‌డేట్ చేస్తూనే ఉంటాం’ అని పేర్కొంది.

మరోవైపు గూగుల్ సపోర్ట్ పేజీలో ‘యూట్యూబ్ హోమ్‌పేజీ, రికమెండేషన్స్, సెర్చ్‌లో వస్తున్న సమస్యల గురించి మాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందనేది కంపెనీ వెల్లడించలేదు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget