అన్వేషించండి

VitalID: ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ

What is VitalID technology | మీ శ్వాస, గుండె చప్పుడు ద్వారా తలలోని ప్రకంపనల ఆధారంగా వ్యక్తులను గుర్తించే సరికొత్త బయోమెట్రిక్ టెక్నాలజీ విటల్ ఐడీ. పాస్‌వర్డ్‌లు లేదా ఫింగర్‌ప్రింట్స్ అవసరం ఉండదు.

టెక్నాలజీ ప్రపంచంలో రోజుకో కొత్త విషయం పుట్టుకొస్తుంది. అయితే వాటిని మనం వినియోగించే తీరుపై పరిణామాలు ఆధారపడి ఉంటాయి. VitalID అని పిలిచే ఒక కొత్త, వినూత్నమైన బయోమెట్రిక్ సిస్టమ్ కనిపెట్టారు. రట్జర్స్ యూనివర్సిటీ (Rutgers University) పరిశోధకులు ఈ బయోమెట్రిక్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పాస్‌వర్డ్, పిన్ (PIN) లేదా ఫింగర్‌ప్రింట్ అవసరం లేకున్నా మీరు మీ అకౌంట్లలోకి లాగిన్ అవ్వొచ్చు. దానికి బదులుగా ఇది మీ శరీరంలో ఉత్పన్నమయ్యే ప్రకంపనలు (Vibrations) ఆధారంగా మీ ఐడెండిటీని గుర్తిస్తుంది.

శరీర కదలికలతో మిమ్మల్ని గుర్తిస్తుంది 
మన శరీరం ఎప్పుడూ పూర్తిగా అలాగే ఉండదు. శ్వాసక్రియ , గుండె చప్పుడుతో శరీరంలో స్వల్ప కంపనాలు ఉత్పన్నమవుతాయి. ఇవి మెడ గుండా ప్రయాణించి తల వరకు చేరుకుంటాయి. ఈ కంపనాలు తలకు చేరుకున్నప్పుడు చాలా స్వల్పమైన కదలికలను కలిగిస్తాయి. ప్రతి వ్యక్తి తల ఆకృతి, మందం, ఎముకల సాంద్రత భిన్నంగా ఉంటాయి. దీనితో పాటు, ముఖ కండరాలు,  కొవ్వు కూడా ఈ కంపనాల నమూనాను ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి మనిషిలో ఈ ప్రకంపనలు ఒక ప్రత్యేకమైన నమూనాను ఏర్పరుస్తాయి. ఇది వారి గుర్తింపు (Identity)గా మారుతుంది.

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
VitalIDని ఉపయోగించడానికి ఎలాంటి ప్రత్యేక కొత్త హార్డ్‌వేర్ అవసరం లేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న VR.. AR హెడ్‌సెట్‌లలో ఇప్పటికే ఉన్న మోషన్ సెన్సార్లు ఈ పనిని చేస్తాయి.  శ్వాస తీసుకోవడం, గుండె చప్పుడు ద్వారా ఉత్పన్నమయ్యే తలలోని అతి సూక్ష్మమైన కదలికలను ఈ సిస్టమ్ ఆ సెన్సార్ల సహాయంతో గుర్తిస్తుంది. ఆ తర్వాత, ఈ సాఫ్ట్‌వేర్ తల తిప్పడం లేదా నడవడం వంటి సాధారణ కదలికలను వేరు చేసి, కేవలం బయోలాజికల్ సిగ్నల్స్‌ను మాత్రమే గుర్తిస్తుంది. అనంతరం ఈ సిగ్నల్‌ను ముందుగా సేవ్ చేసిన ప్రొఫైల్‌తో మ్యాచ్ చేసి మీ గుర్తింపును నిర్ధారిస్తుంది.

ఇది నిజంగా సురక్షితమేనా?
ముఖం, వేలిముద్రలు లేదా కంటి స్కాన్ వంటి చాలా బయోమెట్రిక్ సిస్టమ్‌లను ఏదో ఒక విధంగా కాపీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ తల కదలికలను కాపీ చేయడం చాలా కష్టమని భావిస్తున్నారు. ఎవరైనా మీ శ్వాస వేగాన్ని అనుకరించగలిగినప్పటికీ, మీ తల నిర్మాణం, అంతర్గత అమరికను ప్రతిబింబించేలా చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ సిస్టమ్ మరింత సురక్షితమైనదిగా భావిస్తున్నారు.

పనితీరు ఎలా ఉంది?
ఒక పరిశోధనలో భాగంగా సుమారు 10 నెలల పాటు 52 మందిపై ఈ విటల్ ఐడీ టెక్నాలజీని పరీక్షించారు. ఇందులో ఈ సిస్టమ్ 95 శాతం కంటే ఎక్కువ సందర్భాల్లో సరైన వ్యక్తిని గుర్తించగలిగిందని, అలాగే అనధికారిక వ్యక్తులను గుర్తించడంలో 98 శాతానికి పైగా విజయం సాధించిందని తేలింది. ఈ టెక్నాలజీకి 2025లో ఒక ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కింది.

భవిష్యత్తులో లాగిన్ టెక్నాలజీ ఇదే
VR, AR పరికరాలు బ్యాంకింగ్, హెల్త్ రికార్డులు, ఆఫీస్ సిస్టమ్స్‌ను యాక్సెస్ చేయడానికి మార్గాలుగా మారుతున్న కొద్దీ,  సేఫ్, ఈజీ లాగిన్ సిస్టమ్ అవసరం పెరుగుతోంది. VitalID ఈ దిశలో ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు. ఇందులో వినియోగదారుడు చేయాల్సిందేమీ లేదు. కేవలం హెడ్‌సెట్ ధరించగానే, మీరు అసలైన వినియోగదారులా కాదా అని సిస్టమ్ గుర్తిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget