అన్వేషించండి

మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి

How to check Apple iPhone real or fake: కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా.. అయితే నకిలీ iPhones కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండి నకిలీదా కాదా గుర్తించాలి.

iPhone కొనాలని చాలా మంది కలలు కంటారు. అయితే తమ వద్ద అంత బడ్జెట్ లేకపోవడంతో ఎక్కడైనా తక్కువ ధరకు దొరుకుతుందా అని చూసి మోసపోతుంటారు. కానీ మార్కెట్‌లో నకిలీ ఐఫోన్ (Fake iPhone)లను కూడా చాలా తెలివిగా విక్రయిస్తున్నారు. ఇవి చూడటానికి అసలు ఫోన్లలాగే అనిపిస్తాయి. కానీ వీటి పనితీరు కాస్త తక్కువగా ఉంటుంది. వాటి ద్వారా సేఫ్టీ ఉండదు. మీకు ఏదైనా నష్టం జరిగినా Apple నుండి ఎటువంటి అధికారిక సపోర్ట్ లభించదు. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా షాపులో iPhone కొనుగోలు చేస్తున్నట్లయితే, మోసపోకుండా ఉండటానికి దాని అసలైన గుర్తింపును చెక్ చేసి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

IMEI నంబర్‌తో వెంటనే గుర్తించండి

IMEI నంబర్‌ను చెక్ చేయడం అత్యంత సులభమైన మార్గం. మీ ఫోన్‌లో *#06# డయల్ చేయండి. స్క్రీన్‌పై మీకు IMEI నంబర్ కనిపిస్తుంది. ఆ తర్వాత Apple అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ నంబర్‌ను ఎంటర్ చేసి చెక్ చేయండి. ఒకవేళ ఆ నంబర్ తప్పుగా లేదా తెలియనిదిగా కనిపిస్తే, ఆ ఫోన్ ఫేక్ ఐఫోన్ అని అర్థం చేసుకోండి.

సీరియల్ నంబర్‌తో నిర్ధారణ

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి General > Aboutలో సీరియల్ నంబర్‌ను చెక్ చేయండి. ఈ నంబర్‌ను Apple వారి ‘Check Coverage’ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి వెరిఫై చేయండి. అక్కడ ఎటువంటి సమాచారం లభించకపోయినా లేదా ఎర్రర్ వచ్చినా, అది నకిలీ లేదా అన్‌రిజిస్టర్డ్ డివైజ్  అయ్యే అవకాశం ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్‌తో తేడాను గుర్తించండి

అసలైన iPhone ఎల్లప్పుడూ Apple సొంత సాఫ్ట్‌వేర్ అయిన iOSపై రన్ అవుతుంది. నకిలీ ఫోన్లు తరచుగా Androidపై ఉన్నప్పటికీ, వాటిని iOS లాగా కనిపించేలా చేస్తారు. దీనిని గుర్తించడానికి App Storeను ఓపెన్ చేయండి. ఒకవేళ అక్కడ Google Play Store కనిపిస్తే, ఆ ఫోన్ అసలైనది కాదు.

బిల్డ్ క్వాలిటీ చెక్ చేయాలి 

ఒరిజినల్ iPhone ఫినిషింగ్ ప్రీమియంగా ఉంటుంది. మెటల్, గ్లాస్‌తో కూడిన స్ట్రాంగ్ బాడీ, ఖచ్చితమైన డిజైన్, సరైన చోట అమర్చిన బటన్లు ఉంటాయి. అదే నకిలీ ఫోన్లలో లూజ్ బటన్లు, నాణ్యత లేని ఫినిషింగ్ ఉంటే చౌకగా అనిపించే అనుభూతి కలుగుతుంది.

App Storeతో కన్ఫర్మ్ చేయండి

అసలైన iPhoneలో కేవలం Apple App Store మాత్రమే ఉంటుంది. ఫోన్‌లో Google Play వంటి ఇతర యాప్ స్టోర్లు కనిపించాయంటే అది ఆ ఐఫోన్ నకిలీ అని కన్ఫామ్ చేయవచ్చు. అంతేకాకుండా, మీ iPhoneను USB ద్వారా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి iTunes లేదా Finderను తెరవాలి. అసలైన iPhone వెంటనే గుర్తించవచ్చు. కానీ నకిలీ పరికరాలు తరచుగా కనెక్ట్ కావు లేదా సరిగ్గా డిటెక్ట్ అవ్వవు.

Siri, ధర,  ప్యాకేజింగ్‌ను గమనించండి

పవర్ బటన్‌ను నొక్కి Siriని ఆన్ చేయండి; ఒకవేళ అది పని చేయకపోతే అనుమానించాలి. అలాగే, చాలా తక్కువ ధరకే లభించే iPhone కూడా ప్రమాదానికి సంకేతం కావచ్చు. ప్యాకేజింగ్, బాక్స్, యాక్సెసరీల నాణ్యతను కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అసలైన Apple ఉత్పత్తులు ఎల్లప్పుడూ ప్రీమియం ప్యాకింగ్‌తోనే మార్కెట్లోకి వస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget