అన్వేషించండి

ఆటల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సంచలనం! ఏఐ అద్దాల సాయంతో మారథాన్ పూర్తి చేసిన అథ్లెట్లు! 

అన్ని రంగాల్లో కూడా ఏఐ విప్లవం తీసుకొస్తోంది. ఇప్పుడు క్రీడాకారులకు ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల వారికి లైఫ్‌లైన్‌లా మారుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ అద్దాలతో మారథాన్ పూర్తి చేశారు అథ్లెట్లు!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అంధ అథ్లెట్లు AI అద్దాలతో మారథాన్ పూర్తి చేశారు.
  • AI అద్దాలు, యాప్ వాలంటీర్ల సహాయంతో పరుగు సాధ్యమైంది.
  • AI ఫుట్‌బాల్, క్రికెట్ వ్యూహాలు, అథ్లెట్ల పర్యవేక్షణకు తోడ్పడుతుంది.
  • AI పారా ఒలింపిక్ క్రీడల్లో అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అందిస్తుంది.

ప్రపంచం కీలకమైన మలుపులో ఉంది. భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ముందు తరం, తర్వాత తరం అని చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి క్రీడారంగం మినహాయింపు కాదు. ఈ ఏఐ టెక్నాలజీ ప్రత్యేక అవసరాలు కలిగిన క్రీడాకారుల్లో కొత్త ఆశలు కలిగిస్తోంది. మైదానంలో అథ్లెట్లకు నేరుగా గైడ్ చేసి వారి విజయానికి తోడ్పాటును అందిస్తోంది. ఈ ఏఐ సహాయంతో అంధ అథ్లెట్లు మారథాన్ పూర్తి చేశారంటే టెక్నాలజీ ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. 

ఏఐ అద్దాలతో అంధ అథ్లెట్లు మారథాన్‌తో ప్రపంచ రికార్డు 

ఇటీవల బ్రైటన‌లో మారథాన్ జరిగింది. అందులో క్లార్క్ రేనాల్డ్స్‌ అనే అథ్లెట్ పాల్గొన్నారు. ఆయనకు ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అయినా సరే ఆ ఈవెంట్‌లో పాల్గొని 26.2 కిలోమీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీనికి ఆయన మెటా ఏఐ స్మార్‌ గ్లాసెస్ సహాయం తీసుకున్నాడు. దీనికి తోడు Be My Eyes అనేయాప్  సహకరించింది. మొత్తానికి టెక్నాలజీ సహాయంతో అతను సాధించిన రికార్డు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

ఎలా సాధ్యమైంది?

క్లార్క్ ధరించిన రేబాన్‌ మెటా స్మార్ట్ గ్లాసెస్‌ నేరుగా యాప్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. వీటి సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వాలంటీర్లు ఈ అద్దాల సహాయంతో కెమెరా ద్వారా క్లార్క్‌ ముందు ఉన్న మార్గాన్ని చూస్తూ గైడ్ చేశారు. దీని వల్ల ఫిజికల్‌గా‌ గైడ్ అవసరం లేకుండానే ఏఐ, వాలంటీర్ల సమన్వయంతో ఆయన పరుగును కంప్లీట్ చేశాడు. 

న్యూయార్క్‌ హాఫ్‌ మారథాన్‌ో థామస్ పానెక్ అనే రన్నర్ కూడా మెటా ఏఐ అద్దాల సహాయంతో పరుగును పూర్తి చేసి మరో మైలురాయిని అధిగమించారు. ఆయన కోచ్‌ కొలరాడోలోని తన నివాసం నుంచే ఈ అద్దాల ద్వారా రేసును వీ౭ిస్తూ పానెక్‌ను గైడ్ చేశారు. 

ఎలైట్ స్పోర్ట్స్‌లో ఏఐ వ్యూహాలు 

కేవలం అంధ అథ్లెట్లకే కాకుండా ఫుట్‌బాలు, క్రికెట్ వంటి ప్రధాన క్రీడల్లో కూడా ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. గూగుల్ డీప్‌మైండ్‌ సహకారంతో లీవర్పూల్‌‌ ఎఫ్‌సీ టాక్టిక్‌ ఏఐ అనే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది 7వేల కంటే ఎక్కువ కార్నర్‌ కిక్‌లను విశ్లేషించి ఆటగాళ్ల స్థానాలను ఎలా సర్దుబాటు చేయాలో కోచ్‌లకు సూచిస్తుంది. వేరబుల్ సెన్సార్లు, జీపీఎస్ పరికరాల ద్వారా అథ్లెట్లు హృదయ స్పందన రేటు, అలసట,కండరాల ఒత్తిడిని పర్యవేక్షించవచ్చు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడానికి కూడా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌ పని చేస్తున్నాయి. 

పారా ఒలింపిక్ క్రీడల్లో ఏఐ ప్రభావం 

పారా ఒలింపిక్ క్రీడల్లో ఏఐ టెక్నాలజీ అథ్లెట్ల పనితీరును మెరుగుపరచడమే కాకుండా వారికి మంచి గుర్తింపు తీసుకొస్తుంది. అథ్లెట్ల వైకల్యానికి అనుగుణంగా శిక్షణ ప్రణాళికలను ఏఐ రూపొందిస్తుంది. స్వీడిష్ పారా ఒలింపిక్‌ అథ్లెట్లపై చేసిన పరిశోధనలో ఏఐ ఆధారిత యాప్‌ల ద్వారా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు.  క్రీడల్లో ఏఐ కేవలం ఒక ప్రయోగంకాదు, అది ఒక అనివార్యమైన శక్తిగా మారుతోంది. దీని వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూాడ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస‌్తున్నారు. 

Frequently Asked Questions

AI అద్దాలు అంధ అథ్లెట్లకు ఎలా సహాయపడతాయి?

AI అద్దాలు కెమెరా ద్వారా అథ్లెట్ ముందున్న మార్గాన్ని చూస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల ద్వారా గైడ్ చేస్తాయి. దీనివల్ల ఫిజికల్ గైడ్ అవసరం లేకుండానే పరుగు పూర్తి చేయవచ్చు.

AI క్రీడలలో ఇతర అథ్లెట్లకు ఎలా ఉపయోగపడుతుంది?

AI ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలలో వ్యూహాలను మెరుగుపరచడానికి, ఆటగాళ్ల స్థానాలను సర్దుబాటు చేయడానికి కోచ్‌లకు సూచనలు ఇస్తుంది. వేరబుల్ సెన్సార్ల ద్వారా అథ్లెట్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది.

పారా ఒలింపిక్స్ లో AI పాత్ర ఏమిటి?

పారా ఒలింపిక్ క్రీడల్లో AI అథ్లెట్ల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, వారి వైకల్యానికి అనుగుణంగా శిక్షణ ప్రణాళికలను రూపొందిస్తుంది.

AI సహాయంతో మారథాన్ పూర్తి చేసిన అంధ అథ్లెట్ ఎవరు?

క్లార్క్ రేనాల్డ్స్ అనే అంధ అథ్లెట్ మెటా AI స్మార్ట్ గ్లాసెస్ మరియు Be My Eyes యాప్ సహాయంతో బ్రైటన్‌లో మారథాన్ పూర్తి చేశారు.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget