అన్వేషించండి
Incognito Mode History Delete:మొబైల్, ల్యాప్‌టాప్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ హిస్టరీని ఇలా ఈజీగా డిలీట్ చేసేయండి!
Incognito Mode History Delete: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో చాలా మంది బ్రౌజర్లను వాడుతుంటారు. అయనా సరే అవి కూడా రికార్డు అవుతూ ఉంటాయి. వాటిని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం.
నేటి డిజిటల్ యుగంలో మన ఆన్లైన్ కార్యకలాపాలన్నీ ఎక్కడో ఒకచోట రికార్డ్ అవుతున్నాయి. మనం ఏదైనా వ్యక్తిగతంగా ఉంచాలనుకున్నప్పుడు, అంటే ఏదైనా ప్రత్యేక వెబ్సైట్ను సందర్శించడం, రహస్యంగా ఏదైనా అంశాన్ని శోధించడం లేదా ట్రేస్ లేకుండా మన ఖాతాలకు లాగిన్ అవ్వడం వంటివి చేయాలనుకున్నప్పుడు, మనం ఇంకాగ్నిటో మోడ్ అంటే ప్రైవేట్ బ్రౌజింగ్ను ఆశ్రయిస్తాము. ఇంకాగ్నిటో మోడ్లో బ్రౌజ్ చేయడం ద్వారా మన చరిత్ర అంతా ఆటోమేటిక్‌గా కనిపించకుండా పోతుందని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం కొంత భిన్నంగా ఉంటుంది.
1/5

Incognito Mode History Delete: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో మీరు బ్రౌజర్‌కు ఓపెన్ చేసిన పేజీలు, కుకీలు, ఫారమ్ డేటా లేదా బ్రౌజింగ్ చరిత్రను మీ సిస్టమ్‌లో సేవ్ చేయదు. అంటే మీరు ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌ను మూసివేసిన వెంటనే, ఆ సమాచారం అంతా డిలీట్ అవుతుంది. అయితే, దీని అర్థం మీ యాక్టవిటీ ఇంటర్నెట్ నుంచి పూర్తిగా కనిపించకుండా పోతుందని కాదు. మీ బ్రౌజింగ్ ఇప్పటికీ మీ ఇంటర్నెట్ ప్రొవైడర్, రౌటర్, కొన్ని థర్డ్‌పార్ట టూల్స్ రికార్డ్‌లలో ఉండవచ్చు. ముఖ్యంగా DNS కాష్, నెట్‌వర్క్ లాగ్‌లలో మీ ఇన్‌కాగ్నిటో యాక్టివిటీ చూడొచ్చు.
2/5

Incognito Mode History Delete: ఇలాంటప్పుడు, మీరు ఇన్కాగ్నిటో మోడ్లో చేసిన బ్రౌజింగ్ పూర్తిగా తొలగిపోయందని నిర్ధారించుకోవాలనుకుంటే, DNS కాష్‌ని క్లియర్ చేయడం ఒక సులభమైన మార్గం. మీరు ఏదైనా షేర్డ్ కంప్యూటర్ లేదా Wi-Fi నెట్‌వర్క్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీ ప్రైవేట్ సెర్చ్ గురించి ఎవరికీ తెలియకూడదని అనుకున్నప్పుడు ఈ స్టెప్ ముఖ్యంగా అవసరం.
Published at : 28 Oct 2025 03:01 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















