అన్వేషించండి

New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Online Gaming Rules | ఆన్లైన్ గేమింగ్ కొత్త నియమాలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గేమర్స్ భద్రత (Online Gamers)కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు.

New Online Gaming Rules: న్యూఢిల్లీ: భారత్‌లో కొన్ని నెలల కిందట ఆన్‌లైన్ గేమింగ్ మీద నిర్ణయం తీసుకోగా.. నేటి (మే 1) నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్, 2026 నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఇవి గేమింగ్ ఇండస్ట్రీని క్రమబద్ధీకరించడమే కాకుండా గేమర్‌లకు సేఫ్ డిజిటల్ స్పేస్ కూడా అందిస్తాయి. ఈ రూల్స్ అమలులోకి రావడంతో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి కేంద్రీకృత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్‌ను 3 భాగాలుగా విభజించారు. దాంతోపాటు ఇకనుంచి మనీ పెట్టి గేమ్స్ ఆడటంపై పూర్తిగా నిషేధం విధించారు. కొత్త రూల్స్ అమలులోకి రావడంతో ఏం జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. 

కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ ద్వారా ఏం మారింది ?

కొత్త గేమింగ్ రూల్స్‌ను వినియోగదారుల సెక్యూరిటీ, సురక్షితమైన గేమింగ్, ఈ విభాగం వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలకు ఒక్కో తీరుగా రూల్స్ ఉండేవి. ఈ నిబంధనల ప్రకారం, ఇప్పుడు గందరగోళాన్ని తొలగించారు. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ అమలులోకి రావడంతో డబ్బు పెట్టి ఆడే ఆటలు పూర్తిగా నిషేధించారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే రూల్ కూడా ఉంది. ఎవరైనా ఆన్‌లైన్ పెయిడ్ గేమింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే కనుక వారికి 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఆన్‌లైన్ పెయిడ్ గేమింగ్‌ను ప్రకటిస్తే కనుక ప్రభుత్వం వారికి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించవచ్చు.

3 కేటగిరీలుగా ఆన్‌లైన్ గేమ్స్ 

కొత్త ఆన్‌లైన్ గేమ్స్ నిబంధనల ప్రకారం గేమింగ్‌ను 3కేటగిరీలుగా విభజించారు. E-స్పోర్ట్స్ విభాగంలో ప్రొఫెషనల్, కాంపిటీటివ్ గేమింగ్, స్కిల్స్ అండ్ స్ట్రాటజీ ఆధారిత గేమ్స్ చేర్చారు. ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌లో వినోదంతో పాటు నేర్చుకోవడం ఉంటుంది.  సాధారణంగా సేఫ్ అని భావించే ఆటలను ఆన్‌లైన్ గేమింగ్‌లో చేర్చారు. మూడవ కేటగిరీ ఆన్‌లైన్ మనీ గేమ్స్ కాగా దీనిపై పూర్తిగా నిషేధం విధించారు. ఆటల వర్గాలను నిర్ణయించే అధికారం ఒక కేంద్రం చేతిలో ఉంది. 

గేమర్స్‌పై ఏ ప్రభావం చూపుతుంది.. 

కొత్త ఆన్‌లైన్ నిబంధనలలో గేమర్స్ భద్రతపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్త రూల్స్ వినియోగదారుల వయస్సు ధృవీకరణ, టైమ్ లిమిట్ నియంత్రణ, పేరెంటల్ కంట్రోల్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా తప్పనిసరి చేసింది. అది కొన్ని సమస్యలకు పరిష్కారం చూపింది. ఇది గేమింగ్‌కు బానిస కావడాన్ని అరికట్టడానికి కొంత దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ నిబంధనలు ప్రజలను ఆర్థిక నష్టాల నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి.  

కొత్త చట్టాలు, రూల్స్ వచ్చాక ఈ విభాగంలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు డబ్బులు పెట్టి ఆన్ లైన్ గేమింగ్ వెళ్లే వారు సైతం డబ్బులో పోగొట్టుకోకుండా కొంచెం కట్టడి చేసినట్లు రూల్స్ పనిచేస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget