Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
లావా మనదేశంలో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే లావా అగ్ని 5జీ. దీని ధర రూ.19,999గా ఉంది.
![Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు! Lava AGNI 5G Launched in India Price Rs 19999 Specification Features Know Details Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/09/256f296ba109fc77e37b7a41ea74be0a_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే లావా అగ్ని 5జీ. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 90 హెర్ట్జ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. రియల్‌మీ 8ఎస్ 5జీ,
లావా అగ్ని 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద నవంబర్ 18వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ జరగనుంది. ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకుంటే రూ.2,000 తగ్గింపు లభించనుంది.
లావా అగ్ని 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. హోల్ పంచ్ డిజైన్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ వైడ్‌యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. ఏఐ మోడ్, సూపర్ నైట్, ప్రో మోడ్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 90 నిమిషాల్లోపే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుందని కంపెనీ అంటోంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?
Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)