News
News
X

Nokia T20: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా మనదేశంలో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే నోకియా టీ20. దీని ధర మనదేశంలో రూ.15,499 నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

నోకియా టీ20 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఇదే. ఇందులో 2కే డిస్‌ప్లే, 8200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 15 గంటల పాటు వెబ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఇందులో స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రియల్‌మీ ప్యాడ్‌తో ఇది పోటీ పడనుంది.

నోకియా టీ20 ధర
ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గా ఉంది. నోకియా టీ20 4జీ మోడల్ ధర రూ.18,499గా ఉంది. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి జరగనుంది.

నోకియా టీ20 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 10.4 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 400 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.

ఓజో ప్లేబ్యాక్, స్టీరియో స్పీకర్లు ఇందులో అందించారు. నాయిస్ క్యాన్సిలేషన్ కోసం డ్యూయల్ మైక్రో ఫోన్లు ఇందులో అందించారు. 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 8200 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 

Also Read: ఈ ఫోన్లు వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. నవంబర్ 1వ తేదీ నుంచి వాట్సాప్ బంద్!

Also Read: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!

Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 05:20 PM (IST) Tags: Nokia Nokia T20 Nokia T20 Launched Nokia T20 Launched in India Nokia T20 Price in India Nokia T20 Specifications Nokia T20 Features

సంబంధిత కథనాలు

Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్

Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్

OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!

OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!

BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

టాప్ స్టోరీస్

TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

TS Teachers Transfers :  ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్,  స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్‌కు బైరెడ్డి సవాల్ !

Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్‌కు బైరెడ్డి సవాల్ !

AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ - ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...

AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ -  ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...

Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో

Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో