Whatsapp: ఈ ఫోన్లు వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. నవంబర్ 1వ తేదీ నుంచి వాట్సాప్ బంద్!
ప్రపంచ నంబర్‌వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లకి సపోర్ట్ చేయదు. నవంబర్ 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.4, అంతకంటే తక్కువ వెర్షన్లపై పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది.
నవంబర్ 1వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లకి సపోర్ట్ చేయడం మానేయనుంది. దీంతో కొంతమందికి వారి చాట్‌లు ఎక్స్‌పోర్ట్ అవ్వకపోవడం, బ్యాకప్ అవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాట్సాప్ కూడా సర్వీస్ కొనసాగించడానికి సపోర్ట్ చేసే డివైస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోమని వినియోగదారులకు సూచించింది. ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకంటే ఎక్కువ తర్వాత వచ్చిన వెర్షన్లను మాత్రమే వాట్సాప్ ప్రస్తుతానికి సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 4.0.4, అంతకంటే పాత వెర్షన్లపై పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. మీ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే చిన్న టిప్స్ పాటిస్తే చాలు. మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అబౌట్ ఫోన్‌పై క్లిక్ చేయాలి. అందులో కింద ఆండ్రాయిడ్ వెర్షన్ మీద క్లిక్ చేస్తే.. మీ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ కనిపిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్ కంటే అప్‌గ్రేడెడ్ అయితే మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేస్తుంది.
ఒకవేళ మీ డివైస్ పనిచేయని లిస్ట్‌లో ఉన్నట్లయితే.. మీరు మీ చాట్ హిస్టరీని ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమో, లేదా ప్రత్యేక ఇండివిడ్యువల్ చాట్లు, గ్రూప్ చాట్ల ద్వారా మీరు మీకు కావాల్సిన చాట్లను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మీ చాట్‌ను బ్యాకప్ చేసుకోవడానికి మీరు సెట్టింగ్స్‌లో చాట్‌లోకి వెళ్లి అందులో చాట్ బ్యాకప్‌లోకి వెళ్లాలి.
అక్కడ మీకు కావాల్సిన ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌ను ఎంచుకుని దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన చాట్లలో ఆడియో, ఇమేజెస్, వీడియోలు కూడా ఇన్‌క్లూడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.1 అంతకంటే పైవెర్షన్లు, ఐవోఎస్ 10 అంతకంటే పై వెర్షన్లు, కైఓఎస్ 2.5.0లకు వాట్సాప్ సపోర్ట్ చేయనుంది.
వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఒకేసారి ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించుకునే ఫీచర్ ఉండనుంది. ఇటీవలే వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ కూడా తన పేరును మెటా అని మార్చుకుంది.
Also Read: Apple Macbook Pro(2021): కొత్త మ్యాక్‌బుక్ ప్రోల సేల్ వాయిదా.. ఎప్పుడు కొనేయచ్చంటే?
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!