అన్వేషించండి

Apple Macbook Pro(2021): కొత్త మ్యాక్‌బుక్ ప్రోల సేల్ వాయిదా.. ఎప్పుడు కొనేయచ్చంటే?

యాపిల్ ఈ మధ్యే లాంచ్ చేసిన మ్యాక్‌బుక్ ప్రో సేల్ మనదేశంలో లాంచ్ అయింది. అక్టోబర్ 26వ తేదీన ప్రారంభం కావాల్సిన సేల్ 29వ తేదీకి వాయిదా పడింది.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2021) 14, 16 అంగుళాల వేరియంట్ల సేల్ మనదేశంలో ఆలస్యం కానుంది. నిజానికి వీటి సేల్ అక్టోబర్ 26వ తేదీనే జరగాల్సి ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ 29వ తేదీ నుంచి జరగనుంది. కొత్త మాక్‌బుక్ ప్రో మోడళ్లతో పాటు యాపిల్ ఎయిర్ పోడ్స్ సేల్ కూడా అక్టోబర్ 29వ తేదీకి వాయిదా పడింది. గతవారం జరిగిన అన్‌లీష్డ్ వర్చువల్ ఈవెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

యాపిల్ ఇండియా వెబ్‌సైట్ బ్యానర్‌లో 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021), 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021)ల సేల్ అక్టోబర్ 29వ తేదీన జరగనుందని తెలిపారు. దీంతోపాటు మనదేశంలో యాపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్లు అయిన ఇన్‌గ్రాం మైక్రో ,రెడింగ్టన్ ఇండియాల అధికారిక వెబ్ సైట్లో ‘కమింగ్ సూన్’ అనే బ్యానరే ఇంకా కనిపిస్తుంది.

వీటికి సంబంధించిన సేల్ అమెరికాలో ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి. కానీ మనదేశంలో ఎందుకు ఆలస్యం అయిందో మాత్రం తెలియరాలేదు.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2021) ధర
14 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) ధర మనదేశంలో రూ.1,94,900గా ఉంది. విద్యార్థులు దీన్ని రూ.1,75,410కే కొనుగోలు చేయవచ్చు. 16 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) ధర మనదేశంలో రూ.2,39,900గా నిర్ణయించారు. విద్యార్థులకు ఈ మ్యాక్‌బుక్ రూ.2,15,910కే ఇది లభించనుంది.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) స్పెసిఫికేషన్లు
ఇందులో 14 అంగుళాలు, 16 అంగుళాల మోడళ్లు లాంచ్ అయ్యాయి. 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో 14.2 అంగుళాల యాక్టివ్ ఏరియా, 59 లక్షల పిక్సెల్ ఉండనున్నాయి. 16 అంగుళాల వేరియంట్‌లో 16.2 అంగుళాల టచ్ ఏరియా, 7.7 అంగుళాల పిక్సెల్స్ అందించారు.

వీటి డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. టచ్ బార్‌ను తీసేసి, ఎస్‌డీఎక్స్‌సీ కార్డు స్లాట్, హెచ్‌డీఎంఐ పోర్టును అందించారు. 1080పీ ఫేస్‌టైం వెబ్‌క్యామ్‌ను కూడా ఇందులో అందించారు. అయితే ఇందులో ఫేస్ ఐడీ టెక్నాలజీ లేదు. డిజైన్ లెవల్ మార్పులతో పాటు డిస్‌ప్లే అప్‌గ్రేడెడ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఎం1 ప్రో చిప్‌లో 10 కోర్ల సీపీయూని అందించారు. ప్రో నోట్‌బుక్‌కు అందుబాటులో ఉన్న ప్రాసెసర్లలో ప్రపంచంలో బెస్ట్ ప్రాసెసర్ ఎం1 మ్యాక్స్ అని యాపిల్ అంటోంది. ఇందులో కూడా 10 కోర్ల సీపీయూని అందించారు. జీపీయూలో మాత్రం 32 కోర్లు ఉండనున్నాయి. 

ఇందులో లిక్విడ్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. మినీ ఎల్ఈడీ టెక్నాలజీని ఇవి ఉపయోగించుకోనున్నాయి. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో పీ3 వైడ్ కలర్ గాముట్, హెచ్‌డీఆర్ సపోర్ట్, ఎక్స్‌డీఆర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మోడళ్లలో మ్యాజిక్ కీబోర్డును అందించారు. ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఇందులో ఉంది. మ్యాక్ఓఎస్ మాంటేరే ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.

ఈ ల్యాప్‌టాప్‌ల్లో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టం ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021) 17 గంటల వీడియో ప్లేబ్యాక్, 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021) 21 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించనున్నాయి.

బ్లూటూత్ వీ5.0, వైఫై 6 కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మాగ్ సేఫ్ చార్జింగ్ పోర్టును అందించారు. ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రోను మూడు వరకు ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్, 4కే టీవీకి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎం1 ప్రో చిప్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రోని రెండు ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?

Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?

Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
South Coast Railway: కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Embed widget