By: ABP Desam | Published : 25 Oct 2021 08:23 PM (IST)|Updated : 25 Oct 2021 08:23 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైచేయి సాధించిన అంశాలు ఇవే..
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ అన్ని విభాగాల్లో ఎదురులేని ప్రదర్శన కనపరిచిన భారత్ ఇంత దారుణంగా ఓటమి పాలవడానికి కారణాలు ఏంటి? మనవాళ్లు ఎక్కడ విఫలం అయ్యారు? వాళ్లు ఎక్కడ పట్టు సాధించారు?
టాస్ దగ్గరే సగం..
ఇక్కడ మొదటగా, అత్యంత ప్రాధాన్యంగా చెప్పుకోవాల్సింది టాస్. దుబాయ్ లాంటి పిచ్‌ల మీద మంచు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ చేసేవారికి విజయావకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. అందులోనూ భారత్ నిర్దేశించింది ఎక్కువ లక్ష్యం కూడా కాదు. కాబట్టి టాస్ ఓడిపోయినప్పుడే మనం సగం మ్యాచ్ ఓడిపోయాం. టాస్ అనేది పూర్తిగా అదృష్టంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇక్కడ మనం జట్టును కానీ, కోహ్లీని కానీ తప్పుబట్టలేం.
ఓపెనర్లు బాగా ఆడి ఉంటే..
ఇక రెండు జట్ల మధ్యా ప్రధానంగా కనిపించిన తేడా ఓపెనర్లు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన వారు మంచిగా బ్యాటింగ్ చేస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ మీద ఒత్తిడి తగ్గి వారు కూడా బాగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. కానీ మన ఓపెనర్లు ఘోరంగా విఫలం కావడంతో.. తర్వాత వచ్చిన వారి మీద ఒత్తిడి పెరిగి, స్కోరింగ్ రేట్ తగ్గింది. అదే ఫైనల్ స్కోరు మీద కూడా ప్రభావం చూపింది. భారత్ ఓపెనర్లు రాహుల్, రోహిత్ కలిసి మూడు పరుగులు మాత్రమే చేయగా, పాక్ ఓపెనర్లు మాత్రం అజేయంగా స్కోరు ఛేదించేశారు. పాక్ ఓపెనర్లు అస్సలు భారత్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఒక్క క్యాచ్ డ్రాప్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే.. ఒక్క సాధికారిక అప్పీల్ చేసే అవకాశం కూడా భారత్‌కు రాలేదంటే.. పాక్ ఓపెనర్లు ఎంత కట్టుదిట్టంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
అటాకింగ్ బౌలింగ్ కొరవడింది..
బౌలింగ్‌లో చూసుకుంటే.. పాక్ బౌలర్లు మొదటి నుంచి పూర్తి స్థాయిలో అటాకింగ్‌గా వ్యవహరించారు. పరుగులు కట్టడి చేయడానికి కాకుండా కేవలం వికెట్లు తీయాలనే యాటిట్యూడ్ మాత్రమే పాకిస్తాన్ బౌలర్లలో కనిపించింది. ముఖ్యంగా షహీన్ అఫ్రిది వేసిన యార్కర్లకు భారత బ్యాట్స్‌మెన్ దగ్గర అసలు సమాధానమే లేదు. ఒక యార్కర్‌తో రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన షహీన్, మరో యార్కర్‌తో కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక భారత బౌలర్ల మీద మొదటి నుంచి పాక్ ఓపెనర్లు ఎదురుదాడికి దిగడంతో మనవాళ్లు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. కొట్టాల్సిన స్కోరు తక్కువగానే ఉండటంతో.. స్కోరింగ్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. దీంతో ప్రపంచస్థాయి బౌలర్లు కూడా ఒత్తిడిలో గాడి తప్పారు.
ఆరో బౌలింగ్ ఆప్షన్
ఇక్కడ బౌలర్ల యాటిట్యూడ్‌తో పాటు బౌలింగ్ ఆప్షన్లు కూడా కీలక పాత్ర పోషించాయి. టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా బరిలోకి దిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇమాద్ వసీం, హఫీజ్‌లతో రెండేసి ఓవర్లు వేయించింది. వీరిద్దరూ వేసిన నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే వచ్చాయి. మరోవైపు భారత బౌలర్లలో అందరికంటే పొదుపు బౌలింగ్ చేసిన జడేజా బౌలింగ్‌లోనే ఓవర్‌కు ఏడు పరుగుల వరకు వచ్చాయి. దీంతో ఆరో బౌలింగ్ ఆప్షన్‌పై జట్టు కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరో బౌలర్ ఉంటే బౌలింగ్ ఆర్డర్‌లో కాస్త వైవిధ్యం కనిపిస్తుంది.
ఎంతో మెరుగైన పాక్ ఫీల్డింగ్
ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ ఫీల్డింగ్ ఆశ్చర్యకరంగా ఎంతగానో మెరుగుపడింది. ఆపడానికి కష్టమైన ఎన్నో బౌండరీలను పాకిస్తాన్ ఫీల్డర్లు ఆపి, విలువైన పరుగులను సేవ్ చేశారు. దీంతో నాలుగు పరుగులు వచ్చే చోట.. రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇలా బౌండరీలను నిలువరించడం కూడా భారత్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచింది. మరోవైపు భారత్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగానే ఉన్నా.. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ పెద్దగా అవకాశం ఇవ్వకపోవడం, స్కోరు తక్కువ ఉండటంతో ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేసినా ప్రయోజనం లేకపోయింది.
Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
CSK Worst Record: ఐపీఎల్లో చెన్నై చెత్త రికార్డు - 15 సీజన్లలో ఏ జట్టూ చేయని ఘోరమైన ప్రదర్శన!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !