Moto G51: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే మోటో జీ51. దీని ధర రూ.18 వేల రేంజ్‌లోనే ఉంది.
![Moto G51: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా! Motorola New 5G Phone Moto G51 Launched Check Price Specification Features and More Moto G51: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/04/36b959fd7fa48a399663bd520bc13832_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మోటో జీ51 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు హోల్ పంచ్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
మోటో జీ51 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 1,499 యువాన్లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.17,500) నిర్ణయించారు. బ్లూ, గ్రే కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
మోటో జీ51 స్పెసిఫికేషన్లు
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. మైయూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల హోల్ పంచ్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. వెనకవైపు కెమెరాలో డ్యూయల్ వ్యూ రికార్డింగ్, మైక్రో మోషన్ ఫొటోగ్రఫీ, స్పాట్ కలర్ ఫొటోగ్రఫీ, మాక్రో ఫొటోగ్రఫీ, స్మైలింగ్ ఫేస్ క్యాప్చర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డ్యూయల్ 5జీ సపోర్ట్‌ను కూడా ఇందులో మోటొరోలా అందించింది.
Also Read: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!
Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!
Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?
Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)