News
News
X

Honor X30 Max: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే హానర్ ఎక్స్30 మ్యాక్స్.

FOLLOW US: 

హానర్ ఎక్స్30 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను అందించారు. ఏకంగా 7.09 అంగుళాల డిస్‌ప్లేను ఇందులో అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.

హానర్ ఎక్స్30 మ్యాక్స్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగా(సుమారు రూ.28,100) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,699 యువాన్లుగా(సుమారు రూ.31,600) నిర్ణయించారు. చార్మ్ సీ బ్లూ, మ్యాజిక్ నైట్ బ్లాక్, టైటానియం సిల్వర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. చైనాలో నవంబర్ 11వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హానర్ ఎక్స్30 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్‌యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 7.09 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

News Reels

5జీ, 4జీ ఎల్టీఈ, వైపై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?

Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 09:12 PM (IST) Tags: smartphone Tech News Honor X30 Max Price Honor X30 Max Honor X30 Max Specifications Honor X30 Max Features Honor New Phone Honor

సంబంధిత కథనాలు

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

టాప్ స్టోరీస్

Andhra News : మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట - అప్పటి వరకూ బెయిల్‌ ఉన్నట్లే !

Andhra News : మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట - అప్పటి వరకూ బెయిల్‌ ఉన్నట్లే !

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం- వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం-  వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Nara Lokesh: ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్

Nara Lokesh: ‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్