అన్వేషించండి

Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

Location Track Switched Off Phone Tips : మీ ఫోన్ ఎవరైనా దొంగతనం చేసి స్విచ్ ఆఫ్ చేస్తే.. లైవ్ లొకేషన్ తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్మార్ట్‌ఫోన్‌ పోయినా, స్విచ్ ఆఫ్‌ అయినా చివరి లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.
  • ఆండ్రాయిడ్‌లో 'ఫైండ్ మై డివైస్' ద్వారా రిమోట్‌గా ఫోన్‌ను లాక్ చేయవచ్చు.
  • ఐఫోన్‌లో 'ఫైండ్ మై'తో ఆప్‌లైన్‌లో ఉన్నా ఫోన్‌ను గుర్తించవచ్చు.
  • ముందుజాగ్రత్తగా ట్రాకింగ్, సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్ చేయడం ముఖ్యం.

Track Switched Off Phone for Android and iPhone Users : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు కేవలం కాల్స్ చేయడానికి, మెసేజ్‌లు పంపడానికి మాత్రమే కాదు.. స్టడీ, బ్యాంకింగ్, ఆన్‌లైన్ పేమెంట్స్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్స్, వినోదం వంటివన్నీ పోన్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే చాలామంది తమ జీవితాన్ని ఫోన్లోనే గడిపేస్తున్నారు. అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగతనం చేసినా.. చాలా పానిక్ అయిపోతారు. కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనే ఆలోచన కన్నా.. వ్యక్తిగత డేటా, ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారం, ముఖ్యమైన పత్రాలు తప్పుడు చేతుల్లోకి వెళ్లిపోతాయేమోనన్న భయం ఉంటుంది.

ఫోన్‌ను ఎవరైనా దొంగలిస్తే వారు చేసే మొదటి పని.. దాని లొకేషన్‌ను గుర్తించకుండా ఉండేందుకు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడమే. ఇలా చేస్తే ఫోన్‌ను కనుగొనడం దాదాపు అసాధ్యం అని చాలామంది నమ్ముతారు. అలాగే ఫోన్ పోయిందంటే చాలామంది ఆశలు కూడా వదిలేస్తారు. కానీ కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ముందే ఆన్ చేసి ఉంటే.. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ చివరి లొకేషన్‌ను కూడా ట్రాక్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది.

ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ 'ఫైండ్ మై డివైస్' అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ పోగొట్టుకున్న ఫోన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ.. అది చివరిగా యాక్టివ్‌గా ఉన్న లొకేషన్‌ను చూపించగలదు. అయితే ఫోన్ అప్పటికే ఒక గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అయి ఉండాలి. అలాగే ఫైండ్ మై డివైస్ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉండాలి. వినియోగదారుడు వేరొక డివైస్ లేదా కంప్యూటర్ నుంచి అదే అకౌంట్‌కు లాగిన్ అయినప్పుడు.. ఫోన్ చివరి లొకేషన్‌ను మ్యాప్‌పై కనిపిస్తుంది.

ఈ ఫీచర్ మీ లొకేషన్‌ను చూసేందుకు మాత్రమే కాకుండా, అవసరమైతే మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనివల్ల ఇతరులు మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. ఫోన్ దొంగతనం జరిగినప్పుడే కాదు.. కనిపించకుండా పోయినా.. ఎక్కడైనా పడేసుకున్నా కూడా ఈ ఫీచర్ వినియోగించడం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 

మీ ఫోన్ పోయినప్పుడు దాన్ని సులభంగా ట్రాక్ చేయాలంటే.. ముందుగానే కొన్ని సెట్టింగ్‌లను ఎనేబుల్ చేసి ఉంచుకోవాలి. మీ ఫోన్‌లో లొకేషన్ సర్వీసులు ఎనేబుల్ చేసి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఫైండ్ మై డివైస్ ఫీచర్ కూడా ఎనేబుల్ చేసి ఉంచుకోవడం చాలామంచిది. ఇది మీ ఫోన్ మీకు దూరంగా ఉన్నప్పుడు గుర్తించేందుకు హెల్ప్ అవుతుంది.

యాపిల్ యూజర్స్ కోసం.. 

స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ట్రాకింగ్ సంబంధించిన కొన్ని అధునాతన ఫీచర్లు కొన్ని దేశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వాటిని ఇండియాకు కూడా తీసుకురావచ్చు. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు ఫైండ్ మై ఫీచర్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆన్‌లో ఉంటే.. ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పటికీ దాని చివరి లొకేషన్‌ను చూడవచ్చు.

ఈ ఫీచర్ కోసం వినియోగదారులు తమ ఆపిల్ ఖాతాలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఫైండ్ మై, ఫైండ్ మై నెట్‌వర్క్ వంటి ఆప్షన్‌లను ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల వారు మరొక ఆపిల్ డివైజ్ లేదా ఐక్లౌడ్ ఖాతా ద్వారా.. పోగొట్టుకున్న ఐఫోన్ గురించిన సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. అవసరమైతే ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసే ఆప్షన్ కూడా వారికి ఉంటుంది. దీనివల్ల వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది.

ముందు జాగ్రత్త చాలా ముఖ్యం

చాలా మంది తమ ఫోన్‌ను పోగొట్టుకున్న తర్వాతే ఈ ఫీచర్ల గురించి ఆలోచిస్తారు. కానీ సెట్టింగ్‌లు ముందే యాక్టివేట్ చేసి ఉంటేనే అవి నిజంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ రోజే మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రాకింగ్, సెక్యూరిటీ ఫీచర్లను ముందుగానే ఎనేబుల్ చేసుకోండి. క్లిష్ట పరిస్థితులలో మీ ఫోన్‌ను కనుగొనే అవకాశాలను ఇది గణనీయంగా పెంచుతుంది. అలాగే మీ పర్సనల్ డేటా సేఫ్​గా ఉంటుంది. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget