మొబైల్ ఎక్కువగా వాడితే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది.

Image Source: freepik

పని అయినా, వినోదం అయినా, సంభాషణ అయినా, స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించడం కష్టం.

Image Source: freepik

స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్. దీనినే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా అంటారు.

Image Source: freepik

ఇది చాలా కాలం పాటు స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేదా డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వల్ల కలిగే పరిస్థితి.

Image Source: freepik

మరి మొబైల్ ఎక్కువ వాడటం వల్ల కళ్ళకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: freepik

చాలా సేపు ఫోన్ వాడటం వల్ల కళ్ళ కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తాయి.

Image Source: freepik

కళ్లపై ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి కూడా వస్తుంది.

Image Source: freepik

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు భంగిమ మార్పు వల్ల మెడ, భుజాలలో నొప్పి రావచ్చు.

Image Source: freepik

కళ్లలో మంట, దురద లేదా ఎరుపు కూడా ఈ సిండ్రోమ్ సాధారణ లక్షణాలే.

Image Source: freepik