అన్వేషించండి

Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ అయిన షియోమీ 12 అల్ట్రాను త్వరలో లాంచ్ చేయనుంది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇప్పటికే లీకయ్యాయి.

షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. కంపెనీ లాంచ్ చేయనున్న తర్వాతి హైఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఎంఐ 11 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ గురించి షియోమీ ఎటువంటి వివరాలు తెలపలేదు.

షియోమీ 12 గురించిన వివరాలు మొదటిసారి ఆగస్టులోనే లీకయ్యాయి. షియోమీయూఐ వెబ్‌సైట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. షియోమీ రెండు కొత్త డివైస్‌లపై పని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటికి లోకి, థోర్ అని కోడ్ నేమ్స్ ఉన్నాయి. ఇవే షియోమీ 12 అల్ట్రా, షియోమీ 12 అల్ట్రా ఎన్‌హేన్స్‌డ్ అని వార్తలు వస్తున్నాయి.

షియోమీ 12 అల్ట్రా, షియోమీ 12 అల్ట్రా ఎన్‌హేన్స్‌డ్ స్మార్ట్ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. షియోమీ 12 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్5 సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.

ఎంఐ 11 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. కథనాల ప్రకారం.. షియోమీ 12 అల్ట్రా కేవలం చైనాలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

2022 ద్వితీయ త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయా లేదా అనే విషయాన్ని షియోమీ తెలపలేదు. ఇక గతంలో లాంచ్ అయిన ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై ఓ లుక్కేస్తే.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.81 అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు కూడా 1.1 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.

ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఎంఐ 11 అల్ట్రా పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్2 సెన్సార్‌ను అందించారు, దీంతోపాటు మరో రెండు 48 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కాగా, మరొకటి టెలి మాక్రో సెన్సార్.వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 10W రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అభిమానిపై భగ్గుమన్న సోషల్ మీడియా
Jack Movie Review - 'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?
'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?
Singer Abhijeet Bhattacharya : 'రెహమాన్ పద్మ అవార్డు గ్రహీతలను అవమానించారు'... ఆస్కార్ విన్నర్‌పై సింగర్ సెన్సేషనల్ కామెంట్స్
'రెహమాన్ పద్మ అవార్డు గ్రహీతలను అవమానించారు'... ఆస్కార్ విన్నర్‌పై సింగర్ సెన్సేషనల్ కామెంట్స్
Kavitha Statement On Pawan Kalyan: సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
సీరియస్‌ రాజకీయ నాయకుడు కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు 
Konaseema Latest News: జ‌న‌సేన గెలిచిన స్థానాల్లో వ‌ర్గ విభేదాలు, పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల  కొట్లాట!
జ‌న‌సేన గెలిచిన స్థానాల్లో వ‌ర్గ విభేదాలు, పి.గ‌న్న‌వ‌రంలో రెండు వర్గాల కొట్లాట!
Embed widget