By: ABP Desam | Updated at : 05 Dec 2021 07:09 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
హానర్ 60 స్మార్ట్ ఫోన్
హానర్ 60 స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 66W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 108 మెగాపిక్సెల్ కెమెరాను కూడా ఇందులో అందించారు.
హానర్ 60 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను 2,699 యువాన్లుగా (సుమారు రూ.31,700) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగానూ(సుమారు రూ.35,200), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,299 యువాన్లుగానూ(సుమారు రూ.38,800) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
హానర్ 60 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గాముట్ ఫీచర్ కూడా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వ్లాగర్ల కోసం ఇందులో ప్రత్యేకంగా వ్లాగ్ మోడ్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టును ఇందులో అందించారు. ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2, వైఫై 6 కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు
Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
/body>