అన్వేషించండి

Play Store నుంచి 17.5 లక్షల యాప్స్ తొలగించిన Google.. 80 వేల మంది డెవలపర్స్‌పై బ్యాన్

Google Play Store: ఆండ్రాయిడ్ వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడానికి ప్లే స్టోర్ నుంచి 1.75 మిలియన్ల యాప్‌లను గూగుల్ తొలగించింది. 80 వేల మంది డెవలపర్స్‌ను బ్యాన్ చేసింది.

Google Play Store: ఆండ్రాయిడ్ వినియోగదారుల భద్రతపై Google ఫోకస్ చేసింది. ఈ క్రమంలో Play Storeపై చర్యలు మొదలుపెట్టింది. ప్లే స్టోర్ నుంచి ఏకంగా 17.5 లక్షల కంటే ఎక్కువ అనుమానాస్పద, Fake Appsను ప్లాట్‌ఫారమ్ నుంచి గూగుల్ తొలగించింది. దీంతో పాటు దాదాపు 80,000 డెవలపర్ అకౌంట్స్‌ను పర్మినెంట్‌గా బ్లాక్ చేసింది. 2026లో Android ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా ఇది కీలక అడుగు అని చెప్పవచ్చు. 

మాల్వేర్, స్కామ్‌లతో నిండిన యాప్స్
గూగుల్ రిమూవ్ చేసిన మెజారిటీ యాప్‌లలో ప్రమాదకరమైన మాల్వేర్ ఉంది. ఈ యాప్‌లు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయగలవు. యూజర్లకు సమాచారం లేకుండా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను సైతం యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయగలవు అని గూగుల్ భావించింది. అనేక యాప్‌లు యూజర్ల ప్రైవసీకి ప్రత్యక్ష ముప్పుగా మారాయి. తన AI ఆధారిత భద్రతా వ్యవస్థ ఈ యాప్‌లను ముందే గుర్తించిందని, దాంతో అలాంటి యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు Google ప్రతినిధులు తెలిపారు. 

2.55 లక్షల యాప్‌ల డేటా యాక్సెస్ నిలిపివేత
Google సేఫ్టీ టెక్నాలజీ దాదాపు 2.55 లక్షల యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ డేటాను యాక్సెస్ చేయకుండా ముందే బ్లాక్ చేసింది. దాంతో డేటా చోరీ ముప్పుతో పాటు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం నుంచి యూజర్లను సంస్థ కాపాడింది. 

80 వేల మంది డెవలపర్‌లపై శాశ్వత నిషేధం
తమ రూల్స్ పదేపదే ఉల్లంఘించిన, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన డెవలపర్స్ అకౌంట్లను తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో Play Storeలోకి రాకుండా గూగుల్ వాటిపై నిషేధం విధించింది. వినియోగదారుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత అని, అందుకే ఇలాంటి ఖాతాలకు మళ్లీ అవకాశం ఇవ్వబోమని గూగుల్ స్పష్టం చేసింది.

Play Storeలో నిఘా, కొత్త పాలసీ
Android ప్లాట్‌ఫారమ్‌ను మరింత క్లీన్‌గా, సురక్షితంగా ఉంచే లక్ష్యంలో భాగంగా గూగుల్ ఈ చర్యలు తీసుకుంది. లక్షల యాప్స్ తొలగించడంతో పాటు డెవలపర్స్ అకౌంట్లను సైతం బ్యాన్ చేసింది. యాప్‌లను వాటి ప్రారంభ స్టేజ్ నుండే AI టూల్స్ ద్వారా తనిఖీ చేస్తున్నారు. మాల్వేర్, స్పైవేర్ లేదా ఫేక్ యాక్టివిటీలను త్వరగా గుర్తించేందుకు ఈ టూల్స్ Android Studio, Play Store లోని డేటా సేఫ్టీ సెక్షన్‌తో అనుసంధానించారు. కేవలం యాప్‌లే కాకుండా, వినియోగదారులు తప్పుడు రేటింగ్‌లను చూసి మోసపోకుండా ఉండేందుకు కంపెనీ 16 కోట్లకు పైగా ఫేక్ రివ్యూలు, ఫేక్ రేటింగ్‌లను కూడా తొలగించింది.

భారత వినియోగదారులకు కూడా ప్రయోజనం
గూగుల్ తాజా చర్యల వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న Android వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఫేక్ యాప్స్, ఆన్‌లైన్ మోసాల నుంచి కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకోనుంది గూగుల్. ఇక మరింత సురక్షితమైన డౌన్‌లోడ్స్ యూజర్ల డేటాతో పాటు బ్యాంక్ ఖాతాలను రక్షించడం దీని ఉద్దేశం. తమ చర్యలు ఇక్కడితో ఆగవని Google స్పష్టం చేసింది. రాబోయే కాలంలో AI ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ మరింత బలోపేతం చేస్తామని, తద్వారా Play Store గతంలో కంటే మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా మారుతుందని పేర్కొంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
Embed widget