అన్వేషించండి

Google Jobs: గూగుల్‌లో జాబ్ ఎలా సాధ్యం.. ఏం చదవాలి, ఫ్రెషర్స్ ప్యాకేజీ ఎంత ఉంటుంది?

software Jobs in Google | ప్రతి సంవత్సరం గూగుల్ లో ఉద్యోగం కోసం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారు, కానీ ఒక శాతం కంటే తక్కువ మంది ఎంపికవుతారు.

Jobs in Google | ప్రస్తుతం జాబ్ అంటే ఒకటి గవర్నమెంట్ జాబ్ లేదా సాఫ్ట్ వేర్ జాబ్ అంటున్నారు. కొందర్ని మీ డ్రీమ్ జాబ్ ఏమిటని అడిగితే,  ఆలోచించకుండానే Google, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల పేరు చెప్తారు. అద్భుతమైన జీతం, ఉచిత సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వర్క్, కొత్త టెక్నాలజీ, పని ఒత్తిడి తక్కువ అని చెబుతుంటారు. Googleలో పని చేయడం లక్షలాది మంది యువతీ యువకులకు డ్రీమ్ కావడానికి ఇదే కారణం. ప్రతి సంవత్సరం భారతదేశం నుండే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది Googleలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే వారిలో 1 శాతం కంటే తక్కువ మందిని గూగుల్ రిక్రూట్ చేసుకుంటుంది. 
 
Googleలో ఉద్యోగం పొందడం సులభం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. చాలా మంది విద్యార్థులు Google జాబ్ ఎలా కొట్టాలి అని ఆలోచిస్తుంటారు. ఏ కోర్సులు చదవాలి, టాప్ కాలేజీల విద్యార్థులు మాత్రమే ఎంపికవుతారా? అని సందేహాలు వస్తాయి. అయితే Googleలో ఉద్యోగం ఎలా వస్తుంది, ఏం చదవాలి, స్టార్టింగ్ ప్యాకేజీ లాంటి కొంత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. 
 
Googleలో ఉద్యోగం కోసం ఏ కోర్సులు అవసరం?
 
Googleలో ఉద్యోగం సాధించగానికి డిగ్రీ కంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం. అయితే సాఫ్ట్ వేర్ కోర్సులు చేయాలి. Googleలో ఉద్యోగం కోసం అవసరమైన డిగ్రీలు (Preferred Education) B.E. / B.Tech (కంప్యూటర్ సైన్స్ / IT), MCA (Master of Computer Applications) చదవాలి. కొన్ని సందర్భాల్లో B.Sc / M.Sc (Computer Science) వాళ్లకు అవకాశం కల్పిస్తారు. Google కేవలం డిగ్రీని మాత్రమే చూడదు, మీ ఆలోచనా సామర్థ్యం, తెలివితేటలు, టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం.
 
Googleలో ఉద్యోగం ఎలా వస్తుంది? 
 
1. ఆన్‌లైన్ అప్లికేషన్ - మొదట మీరు Google కెరీర్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి, రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఉంటే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీ రెజ్యూమెలో మీ ప్రాజెక్ట్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్యాలను స్పష్టంగా పేర్కొనాలి. ఏదైనా Google ఉద్యోగి నుండి రిఫరల్ వస్తే, సెలక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
 
2. రిక్రూటర్ కాల్ - మీ రెజ్యూమె షార్ట్‌లిస్ట్ అయితే, HR లేదా రిక్రూటర్ నుండి మీకు మెయిల్ లేదా కాల్ వస్తుంది. ఇందులో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు: మీరు ఇప్పటివరకు ఏం పని చేశారు, మీరు Googleలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు. మీ అత్యుత్తమ ప్రాజెక్ట్ ఏది.  ఫ్రెషర్ అయితే మీ ప్రోగ్రామింగ్, టెక్నికల్ స్కిల్స్ పరీక్షిస్తారు.
 
3. టెక్-హోమ్ అసెస్‌మెంట్ / ప్రాజెక్ట్ - కొన్ని పోస్టుల కోసం మీకు ఇంటి నుంచి చేసేందుకు కోడింగ్ టెస్ట్, కేస్ స్టడీ లేదా చిన్న ప్రాజెక్ట్ ఇస్తారు. ఇందులో మీ ఆలోచనా సామర్థ్యం, పని చేసే విధానాన్ని పరిశీలిస్తారు.
 
4. టెక్నికల్ ఇంటర్వ్యూ - ఇది చాలా ముఖ్యమైన దశ. ఇందులో 3 నుండి 5 వరకు ఇంటర్వ్యూ రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ దాదాపు 45–60 నిమిషాలు ఉంటుంది.
 
5. పర్సనాలిటీ టెస్ట్ - ఈ రౌండ్‌లో మీ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు. మీరు టీంలో ఉంటే ఎలా పని చేస్తారు, సమస్యను ఎలా పరిష్కరిస్తారు, కష్ట సమయాల్లో మీరు ఎలా డీల్ చేస్తారో చెక్ చేస్తారు.  
 
6. ఆఫర్ లెటర్ - అన్ని ఇంటర్వ్యూల తర్వాత హెచ్ఆర్ ప్యానెల్ రిక్రూట్ మెంట్ పై నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా 4 నుండి 8 వారాలలో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.
 
Googleలో ప్రారంభ జీతం ఎంత ఉంటుంది?
 
Googleలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (ఫ్రెషర్స్) ఏడాదికి 15 లక్షల నుండి 40 లక్షల జీతం ఉంటుంది. అలాగే జీతం అనేది మీకు ఇచ్చిన లోకేషన్ పై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ఇంటర్న్‌షిప్ జీతం నెలకు 50,000 వేల నుండి 1 లక్ష వరకు ఉంటుంది. 
 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget