అన్వేషించండి

Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి

Power Bank Wired or Wireless | కొత్త పవర్ బ్యాంక్ కొనాలకుకుంటున్నారా.. అయితే వైర్ పవర్ బ్యాంక్, లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్ వల్ల లాభనష్టాలు తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఛార్జింగ్ వేగంలో వైర్డ్ పవర్‌బ్యాంక్ ఉత్తమం, బ్యాటరీకి మంచిది.
  • వైర్‌లెస్ పవర్‌బ్యాంక్ వాడకంలో సులువు, కేబుల్ అవసరం లేదు.
  • వైర్డ్ పవర్‌బ్యాంకులు చవకైనవి, అన్ని ఫోన్‌లకు అనుకూలం.

నేడు స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. రోజంతా వాడినా, లేక ఎక్కువ గంటలు వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా బ్యాటరీ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పవర్ బ్యాంక్‌ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఛార్జింగ్ సౌకర్యం లేని ఏరియాలకు వెళ్ళినప్పుడు మీకు పవర్ బ్యాంక్ అవసరం. పవర్ బ్యాంక్ కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు వైర్ ఉన్నది తీసుకోవాలా, లేక కొత్తగా వచ్చిన వైర్‌లెస్ పవర్ బ్యాంక్ కొనాలా అని ఆలోచన మొదలవుతుంది.

ఒకవైపు వైర్‌లెస్ పవర్ బ్యాంక్ చూడటానికి బాగుండి, వాడేందుకు ఈజీగా అనిపిస్తుంది. మరోవైపు ఇన్నేళ్లుగా వాడుతున్న వైర్ పవర్ బ్యాంక్ (Wired Power Bank) మీకు ఛార్జింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ఇస్తుంది. రెండింటికీ వాటికంటూ కొన్ని ప్లస్, మైనస్ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీకు ఏది సరైనదో ఈ విషయాలను తెలుసుకోండి.

ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ హెల్త్‌లో ఏది బెస్ట్

ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, ఇక్కడ వైర్ పవర్ బ్యాంక్ బెస్ట్ అనిపిస్తుంది. కేబుల్ ద్వారా ఫోన్‌ను పవర్ బ్యాంక్‌కు కనెక్ట్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం నేరుగా, ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. కొత్తగా వస్తున్న వైర్డ్ పవర్ బ్యాంక్‌లు 22.5W నుంచి 65W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తున్నాయి. దాంతో అరగంటలోనే మీ ఫోన్ చాలా వరకు ఛార్జ్ అవుతుంది.

వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లో ఇండక్షన్ కాయిల్ ఉపయోగిస్తారు. ఇందులో గాలి ద్వారా పవర్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ ప్రక్రియలో చాలా శక్తి వేడి రూపంలో పోతుంది. దాంతో ఛార్జింగ్ నెమ్మదిగా జరుగుతుంది. ఇందులో ఎక్కువ వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల ఫోన్ బ్యాటరీపై ప్రతికూలా ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. మీరు తక్కువ సమయంలో త్వరగా ఫోన్ ఛార్జ్ చేసుకోవాలన్నా, బ్యాటరీ వేడెక్కకుండా ఉండాలన్నా వైర్డ్ పవర్ బ్యాంక్ సరైనది.

ఉపయోగించడంలో ఏది బెస్ట్

వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లో దీనిని వేలాడదీసుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా MagSafe లేదా మాగ్నెటిక్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లు ఫోన్ వెనుక భాగంలో అతుక్కుపోతాయి. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా జేబులో ఫోన్ పెట్టుకుని ఛార్జ్ చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. 

ఇందులో చిన్న సమస్య ఏంటంటే, ఫోన్ కవర్ మరీ మందంగా ఉంటే ఛార్జింగ్ సరిగ్గా అవ్వదు. వైర్ ఉన్న పవర్ బ్యాంక్‌తో మీరు ఒక ఛార్జింగ్ కేబుల్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కొన్నిసార్లు జేబులో లేదా బ్యాగ్‌లో చిక్కుకుంటుంది. ఒకవేళ కేబుల్ మర్చిపోయినా లేదా పాడైపోయినా, వైర్ ఉన్న పవర్ బ్యాంక్ పనికిరాకుండా పోతుంది.

ధర, కంపాటిబిలిటీలో ఏది ఉత్తమం

బడ్జెట్, డివైజ్ కంపాటిబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. వైర్ ఉన్న పవర్ బ్యాంక్‌ ప్రపంచంలోని దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను సులభంగా ఛార్జింగ్ చేస్తుంది. ఫోన్ చౌకదైనా లేదా ఖరీదైనదైనా సరే. ధర విషయంలో కూడా వైర్డ్ పవర్ బ్యాంక్‌లు చాలా ఉంటాయి. 1000 రూపాయల నుంచి 1500 లకు 10000mAh లేదా 20000mAh సామర్థ్యం గల పవర్ బ్యాంక్ లభిస్తాయి. 

వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఎంపిక చేసిన, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లతో మాత్రమే పనిచేస్తాయి. వీటి ధర కూడా సాధారణ పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ. పవర్ లాస్ అవ్వడం వల్ల ఇవి ఫోన్‌ను అన్నిసార్లు ఫుల్ ఛార్జ్ చేయలేవు. మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మీరు వేగంగా ఛార్జింగ్ కోరుకుంటే మాత్రం వైర్ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోండి. ఖరీదైన ఫోన్ అయి, కేబుల్స్ వేలాడదీసుకుని ఉంచడం వద్దనుకుంటే వైర్‌లెస్ పవర్ బ్యాంక్ తీసుకోండి.

 

Frequently Asked Questions

ఏ పవర్ బ్యాంక్ వేగంగా ఛార్జ్ చేస్తుంది?

వైర్డ్ పవర్ బ్యాంక్ వేగంగా ఛార్జ్ చేస్తుంది. ఇది నేరుగా విద్యుత్ ప్రవాహంతో 22.5W నుండి 65W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ నెమ్మదిగా ఉంటుంది.

ఫోన్ బ్యాటరీ ఆరోగ్యానికి ఏ పవర్ బ్యాంక్ మంచిది?

వైర్డ్ పవర్ బ్యాంక్ ఫోన్ బ్యాటరీ ఆరోగ్యానికి మంచిది. వైర్‌లెస్ ఛార్జింగ్ వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది, అది బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

ఉపయోగించడానికి ఏ పవర్ బ్యాంక్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది?

వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఫోన్ వెనుక భాగంలో అతుక్కుని, కేబుల్స్ లేకుండా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఏ పవర్ బ్యాంక్ చవకైనది మరియు ఎక్కువ పరికరాలకు అనుకూలమైనది?

వైర్డ్ పవర్ బ్యాంక్‌లు చవకైనవి. అవి దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను ఛార్జ్ చేస్తాయి. వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లు ఖరీదైనవి, ఎంపిక చేసిన ఫోన్‌లకు మాత్రమే పని చేస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Embed widget