ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు, డేటా పోతుందేమోనని ఆందోళన చెందకుండా ఫార్మాట్ చేయడానికి ముందు ఇతర రికవరీ పద్ధతులను ప్రయత్నించాలి. మైక్రోసాఫ్ట్ లేదా లోకల్ అకౌంట్‌లకు వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి.
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు ఆందోళనకు గురై దాన్ని రీసెట్ చేయడం లేదా ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. విండోస్‌లో కొన్ని రికవరీ ఆప్షన్లతో యాక్సెస్ చేయవచ్చు.

- పాస్‌వర్డ్ మరచిపోతే మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా రీసెట్ చేయండి.
- లోకల్ అకౌంట్‌లకు సెక్యూరిటీ ప్రశ్నలు, రీసెట్ డిస్క్ వాడండి.
- CMD ట్రిక్స్ అన్ని సిస్టమ్‌లకు పనిచేయవు, జాగ్రత్తగా ఉండండి.
- డేటా బ్యాకప్ చేసి, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి.
ఈ రోజుల్లో ల్యాప్‌టాప్, ఫోన్లలో ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫోటోలు, ఆఫీస్ ఫైళ్లు, అనేక వ్యక్తిగత సమాచారం సేవ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మీ ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోతే, డేటా పోతుందేమో అని ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యలో చాలామంది ల్యాప్‌టాప్‌ను ఫార్మాట్ చేయడం లేదా విండోస్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలని భావిస్తారు. అలా చేయడానికి ముందు కొన్ని ఇతర మార్గాలను చూడాలి. విండోస్‌లో మైక్రోసాఫ్ట్ అకౌంట్, లోకల్ అకౌంట్స్ కోసం వేర్వేరు రికవరీ ఆప్షన్లు ఉంటాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలి.
మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో పాస్‌వర్డ్ రీసెట్
మీ ల్యాప్‌టాప్ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటే కనుక పాస్‌వర్డ్ రీసెట్ చేయడం తేలిక. ఇందుకోసం మరో ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌కి వెళ్లి పాస్‌వర్డ్ రికవరీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ ఇవ్వాలి. మీ ఐడెంటిటీ గుర్తింపును వెరిఫై చేయడానికి ఒక కోడ్ పంతారు. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ల్యాప్‌టాప్ లాగిన్ స్క్రీన్‌లో కొత్త పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయాలి. మీరు పాస్‌వర్డ్ బదులు పిన్ మర్చిపోయి ఉంటే, లాగిన్ స్క్రీన్‌లో 'I forgot my PIN' ఆప్షన్ సెలక్ట్ చేసుకుని దాన్ని రీసెట్ చేయడానికి ప్రయత్నించాలి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ పాస్‌వర్డ్, విండోస్ పిన్ వేర్వేరు అని తెలిసిందే.
లోకల్ అకౌంట్ ఉంటే ఈ పద్ధతి పాటించండి
మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ బదులు లోకల్ అకౌంట్‌తో ల్యాప్‌టాప్ ఉపయోగిస్తుంటే, లాగిన్ స్క్రీన్‌లో పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత Reset password ఆప్షన్ క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు సెట్ చేసిన అదే సెక్యూరిటీ ప్రశ్నలను విండోస్ అడుగుతుంది. సరైన సమాధానాలు ఇస్తే కొత్త Password క్రియేట్ చేసే ఆప్షన్ లభిస్తుంది. మీరు ముందే పాస్‌వర్డ్ రీసెట్ డిస్క్ తయారు చేసి ఉంటే, దాని ద్వారా కూడా మీరు పాస్‌వర్డ్ మార్చవచ్చు. ల్యాప్‌టాప్‌లో ముందే మరో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంటే కనుక, మీరు దాని ద్వారా లాగిన్ కావచ్చు. అంటే దాని ద్వారా కూడా లోకల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకునే వీలుంటుంది.
CMD ట్రిక్ కంటే ఈ విషయాలపై ఫోకస్ చేయండి
కమాండ్ ప్రాంప్ట్ CMD ద్వారా కొత్త అడ్మిన్ అకౌంట్‌ను యాక్టివ్ చేసే ట్రిక్‌ను అనేక వీడియోల్లో చెబుతారు. కానీ ఈ పద్ధతి ప్రతి విండోస్ ల్యాప్‌టాప్‌లో పనిచేయదని గ్రహించాలి. రికవరీ మోడ్‌లో సెక్యూరిటీ, BitLocker వంటి సేఫ్టీ కారణంగా కమాండ్స్ రన్ చేయడానికి అదనపు వెరిఫికేషన్ కూడా అడుగుతారు. అందుకే తెలియకుండా సిస్టమ్ ఫైళ్లలో లేదా కమాండ్‌లలో మార్పులు చేయడం మానుకోవాలి. పైగా చెప్పిన ప్రాసెస్ పనిచేయకపోతే, నమ్మకమైన టెక్నీషియన్ సహాయం తీసుకోవాలి. ల్యాప్‌టాప్‌ను రీసెట్ చేసే ముందు అవసరమైన ఫైళ్ల బ్యాకప్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే Remove everything వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే తొందరపాటులో అయినా సరే మీరు డేటా కోల్పోకుండా ఉండవచ్చు.
Frequently Asked Questions
ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోతే ఏమి చేయాలి?
మైక్రోసాఫ్ట్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలి?
మరో కంప్యూటర్ లేదా ఫోన్ నుండి మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌కి వెళ్లి పాస్‌వర్డ్ రికవరీ ఎంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ ఇచ్చి, వచ్చిన కోడ్‌తో కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు.
లోకల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎలా మార్చాలి?
లాగిన్ స్క్రీన్‌లో 'Reset password' ఆప్షన్‌ను క్లిక్ చేసి, సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మార్చవచ్చు. పాస్‌వర్డ్ రీసెట్ డిస్క్ లేదా మరొక అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉపయోగించి కూడా రీసెట్ చేయవచ్చు.
CMD ట్రిక్ ద్వారా పాస్‌వర్డ్ రీసెట్ చేయడం సురక్షితమేనా?
CMD ట్రిక్ అన్ని ల్యాప్‌టాప్‌లలో పనిచేయదు, రికవరీ మోడ్‌లో భద్రతా తనిఖీలు ఉంటాయి. సిస్టమ్ ఫైళ్లలో మార్పులు చేయడం మానుకోవాలి, అవసరమైతే నమ్మకమైన టెక్నీషియన్ సహాయం తీసుకోవాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























